భీష్మ తో కుమారి రొమాన్స్

నితిన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘భీష్మ’, రెండవది ‘రంగ్ దే’, ఇంకొకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో ఇంకా పేరు ఖరారు చేయని సినిమా. అయితే ఈ మూడు సినిమాలని ఒక దాని తర్వాత ఒకటి పట్టాలు ఎక్కించాలనే ప్రయత్నం లో ఉన్నాడు నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వం లో భీష్మ సినిమా చేస్తున్న నితిన్… ఈ సినిమా ని ఎలాగైనా ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. […]

Advertisement
Update:2019-07-16 07:00 IST

నితిన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘భీష్మ’, రెండవది ‘రంగ్ దే’, ఇంకొకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో ఇంకా పేరు ఖరారు చేయని సినిమా.

అయితే ఈ మూడు సినిమాలని ఒక దాని తర్వాత ఒకటి పట్టాలు ఎక్కించాలనే ప్రయత్నం లో ఉన్నాడు నితిన్.

ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వం లో భీష్మ సినిమా చేస్తున్న నితిన్… ఈ సినిమా ని ఎలాగైనా ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా లో నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా… ఇప్పుడు ఇంకో హీరోయిన్ ని తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు.

కుమారి 21 F తో పేరు సంపాదించుకున్న హెబ్బా పటేల్ ని ఈ సినిమా లో కి తీసుకోవాలని అనుకుంటున్నారట.

అయితే హెబ్బా పటేల్ ఈ సినిమా లో ఒక మోడ్రన్ గర్ల్ పాత్ర లో కనిపించనుందట. ఒక పాట లో కూడా నితిన్ తో ఆడి పాడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

హెబ్బా పటేల్ కి ప్రస్తుతం అవకాశాలేమీ లేవు. అంతే కాకుండా ఈ భామ కి హిట్స్ కూడా లేకపోవడం తో వచ్చిన సినిమా ని వదులుకోకుండా కాపాడుకోవడం తప్పనిసరి అయింది.

Tags:    
Advertisement

Similar News