బైనాక్యులర్స్ తో... ఫొటో కి పోజిస్తున్న నాని

‘జెర్సీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘మనం’ మరియు ’24’ ఫేమ్ దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ వీడియోతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో కథ ప్రకారం నాని మరియు ఐదుగురు ఆడవాళ్ళ తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు అని వార్తలు వినిపించాయి. తాజాగా దర్శక […]

Advertisement
Update:2019-07-15 14:04 IST

‘జెర్సీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘మనం’ మరియు ’24’ ఫేమ్ దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ వీడియోతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో కథ ప్రకారం నాని మరియు ఐదుగురు ఆడవాళ్ళ తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు అని వార్తలు వినిపించాయి. తాజాగా దర్శక నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అది నిజమేనని తెలుస్తోంది.

చేతిలో బైనాక్యులర్స్ తో నాని నిలబడి చూస్తుండగా మిగతా ఐదుగురు బైనాక్యులర్ లతో నాని వెనకనుండి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరించే విధంగా కామెడీ ఎంటర్ టైనర్ తరహాలో ఉండబోతోందని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ చిత్ర పోస్టర్ చూసి సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News