వీళ్లా "దేశం" నాయకులు... వీళ్లా "గత" ఏలికలు...?

తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బండారాన్ని వారే బయటపెట్టుకోవడం… వారి చీకటి జీవితాలను వారే వెలుగులోకి తీసుకువస్తూండడం తెలుగు ప్రజలకు ఆశ్యర్యాన్నే కాదు ఆవేదనను కలుగజేస్తోంది. తెలుగుదేశం నాయకలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు హద్దుల దాటి వారి వారి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువస్తున్నారని తెలుగు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు సత్యహరిశ్చంద్రుల్లా….. నీతికి, నిజాయితికీ మారుపేరుగా చెప్పుకున్న తెలుగుదేశం నాయకులు ఓటమి ఎదురైన తర్వాత ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, […]

Advertisement
Update:2019-07-15 11:19 IST

తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బండారాన్ని వారే బయటపెట్టుకోవడం… వారి చీకటి జీవితాలను వారే వెలుగులోకి తీసుకువస్తూండడం తెలుగు ప్రజలకు ఆశ్యర్యాన్నే కాదు ఆవేదనను కలుగజేస్తోంది.

తెలుగుదేశం నాయకలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు హద్దుల దాటి వారి వారి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువస్తున్నారని తెలుగు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు సత్యహరిశ్చంద్రుల్లా….. నీతికి, నిజాయితికీ మారుపేరుగా చెప్పుకున్న తెలుగుదేశం నాయకులు ఓటమి ఎదురైన తర్వాత ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, వారి అవినీతిని వారే బయటపెట్టుకోవడంతో “ఇన్నాళ్లూ మనల్ని ఏలింది వీళ్లా… ఇలాంటి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను పాలించారా…!?” అని ఆశ్చర్యపోతున్నారు.

గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు, లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నాయకుడిపైనా, ఆ పార్టీ తీరుపైనా ట్విట్టర్ యుద్ధం చేశారు. అధినేతపైనా… ఆయన తీసుకున్న నిర్ణయాలపైనా కేశినేని నాని ట్విట్టర్ వార్ ని కేవలం ఆయన వ్యక్తిగత అసంతృప్తిగానే తెలుగు ప్రజలు భావించారు. అయితే, తాజాగా కేశినేని నాని తమ సహచర నాయకుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న లక్ష్యంగా చేసిన ట్విట్టర్ యుద్ధం ఆ పార్టీ నాయకుల అవినీతి చరిత్రను బయటపెడుతోంది. ఆ ట్విట్లర్ల యుద్ధాన్ని చూస్తున్న ప్రపంచంలోని తెలుగు వారంతా “వీళ్లా మన నాయకులు…. వీళ్లా మన గత ఏలికలు” అని మండిపడుతున్నారు.

శాసనమండలి సభ్యుడు బుద్ధా వెంకన్నను గుళ్లో కొబ్బరి చిప్నల దొంగ, సెక్స్ రాకెట్ నడిపిన వారు, సైకిల్ బెల్లుల దొంగ, కాల్ మనీ నేరగాడు అంటూ దారుణ పదజాలంతో ట్విట్టర్ వేదికగా విమర్శించారు కేశినేని నాని.

దీనికి ప్రతిగా దొంగ బిల్లులతో, దొంగ పర్మిట్లతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన నువ్వు నా గురించి ట్విట్టర్ లో రాస్తావా అంటూ బుద్ధా వెంకన్న కూడా ట్విట్టర్ వేదికగా కేశినేని నానిపై మండిపడ్డారు.

” భారతదేశ మాజీ స్పీకర్, దివంగత తెలుగుదేశం నాయుకుడు, దళిత నేత జీ.ఎం.సీ. బాలయోగి ఆస్తులను కాజేసింది నువ్వు కాదా…?” అని కూడా బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, విమర్శలపై మాత్రం తెలుగు ప్రజలు అవాక్కవుతున్నారు.

తెలుగుదేశం నాయకులకు మరీ ఇంత దారుణమైన చరిత్ర ఉందా..? అని తెలుగు వారంతా ఆశ్చర్యపోతున్నారు. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం నాయకులు వారి నిజ స్వరూపాలను వారే బయటపెట్టుకోవడం తెలుగు ప్రజలనే కాదు…. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా తమ నాయకుల తీరు తెన్నులపై ఏం మాట్లాడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News