జీవితాంతం విలియమ్సన్ కు క్షమాపణ చెబుతూనే ఉంటా " ఇంగ్లండ్‌ ఆటగాడు

వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఊహించని రీతిలో ఇంగ్లండ్ విజయం సాధించింది. మ్యాచ్‌ టై కాగా.. సూపర్ ఓవర్‌ నిర్వహించారు. అందులోనూ టై కావడంతో ఎక్కువ బౌండరీలు చేసిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. అయితే వరల్డ్ కప్‌ కివీస్‌కు దక్కకుండా చేజారిపోవడానికి ఓవర్‌ త్రో కీలకంగా మారింది. అదే కివీస్‌ ఆశలకు సమాధి కట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో 15పరుగులు చేయాల్సి ఉండగా… రెండు బంతుల్లో పరుగులేమీ రాలేదు. మూడో బంతికి స్ట్రోక్స్ సిక్సర్ కొట్టేశాడు. […]

Advertisement
Update:2019-07-15 09:27 IST

వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఊహించని రీతిలో ఇంగ్లండ్ విజయం సాధించింది. మ్యాచ్‌ టై కాగా.. సూపర్ ఓవర్‌ నిర్వహించారు. అందులోనూ టై కావడంతో ఎక్కువ బౌండరీలు చేసిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.

అయితే వరల్డ్ కప్‌ కివీస్‌కు దక్కకుండా చేజారిపోవడానికి ఓవర్‌ త్రో కీలకంగా మారింది. అదే కివీస్‌ ఆశలకు సమాధి కట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో 15పరుగులు చేయాల్సి ఉండగా… రెండు బంతుల్లో పరుగులేమీ రాలేదు. మూడో బంతికి స్ట్రోక్స్ సిక్సర్ కొట్టేశాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీశారు. ఆ క్రమంలోనే స్ట్రోక్స్ బ్యాట్‌కు తాకిన బంతి ఓవర్ త్రో గా మారి బౌండరీకి వెళ్లిపోయింది. దాంతో ఆ బంతికి ఆరు పరుగులు వచ్చినట్టు అయింది.

ఒకవేళ ఫీల్డర్ విసిరిన బంతికి స్ట్రోక్ బ్యాట్ అడ్డు పడి ఉండకపోతే అది ఓవర్‌ త్రో కాకపోయి ఉంటే కప్‌ న్యూజిలాండ్‌కు దక్కి ఉండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ పరిణామంపై ఆట తర్వాత స్ట్రోక్స్ స్పందించారు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెబుతూనే ఉంటానన్నారు. తాను కావాలని బ్యాట్‌ అడ్డుపెట్టలేదని.. అనుకోకుండా బంతి బ్యాట్‌ను తగిలి బౌండరీకి వెళ్లిపోయిందన్నారు. ఆ పరిణామమే తమ గెలుపులో కీలకంగా మారింది అన్నది మాత్రం వాస్తవమన్నారు స్ట్రోక్స్‌.

Tags:    
Advertisement

Similar News