రెండుగా చీలిన టీమిండియా

వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఓటమితో తిరుగుముఖం పట్టిన టీమిండియాలో గ్రూప్‌ రాజకీయాలు బయటపడుతున్నాయి. టీమిండియా రెండుగా చీలిపోయిందని ఒక ఆంగ్ల పత్రికలో సంచలన కథనం వచ్చింది. టీమిండియా ఇప్పుడు విరాట్ కోహ్లి జట్టు, రోహిత్ శర్మ జట్టుగా చీలినట్టు కథనం. కోహ్లి టీమ్ ను శాసిస్తున్నారని… కేవలం తనకు నచ్చిన వారినే టీంలోకి రానిస్తున్నారని కథనం. కోహ్లిపై సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంబటి రాయుడుకు బదులు విజయ్‌ శంకర్‌ను తీసుకోవడానికి కారణం ఎమ్మెస్కే ప్రసాద్ […]

Advertisement
Update:2019-07-13 11:18 IST

వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఓటమితో తిరుగుముఖం పట్టిన టీమిండియాలో గ్రూప్‌ రాజకీయాలు బయటపడుతున్నాయి. టీమిండియా రెండుగా చీలిపోయిందని ఒక ఆంగ్ల పత్రికలో సంచలన కథనం వచ్చింది. టీమిండియా ఇప్పుడు విరాట్ కోహ్లి జట్టు, రోహిత్ శర్మ జట్టుగా చీలినట్టు కథనం. కోహ్లి టీమ్ ను శాసిస్తున్నారని… కేవలం తనకు నచ్చిన వారినే టీంలోకి రానిస్తున్నారని కథనం.

కోహ్లిపై సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంబటి రాయుడుకు బదులు విజయ్‌ శంకర్‌ను తీసుకోవడానికి కారణం ఎమ్మెస్కే ప్రసాద్ అయినప్పటికీ ఆయన వెనుక కోహ్లి ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫాంలో లేకపోయినా కేఎల్ రాహుల్‌ను తీసుకోవడం వెనుక కోహ్లి పక్షపాత ధోరణి ఉందంటున్నారు. ఐపీఎల్‌ జట్టులో సహచరుడు కాబట్టే చాహల్‌ను కోహ్లి టీంలోకి తెచ్చారని సీనియర్ ఆటగాడు ఒకరు మండిపడినట్టు కథనంలో తెలిపారు.

అయితే టీమిండియాను శాసిస్తున్న ఒక వర్గం రోహిత్ శర్మను పైకి లేపేందుకు కోహ్లిపై ఇలాంటి ఆరోపణలకు పదును పెట్టినందన్న మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

మొత్తం మీద ఓటమి తర్వాత టీమిండియాలో గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు బహిర్గతమైనట్టు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News