కరణం బలరాం భార్య పేరు దాచిపెట్టారు !
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి ఎన్నికను…. వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో సవాల్ చేశారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరారు. కరణం బలరాం సమర్పించిన అఫిడవిట్‌లో వాస్తవాలు వెల్లడించలేదని ఆమంచి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈరోజు మీడియాకు విడుదల చేశారు. బలరాం తన నామినేషన్ పత్రంలో తప్పుడు సమాచారం ఇచ్చారనేది ఆమంచి ఆరోపణ. భార్యతో పాటు తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా […]
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి ఎన్నికను…. వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో సవాల్ చేశారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరారు. కరణం బలరాం సమర్పించిన అఫిడవిట్‌లో వాస్తవాలు వెల్లడించలేదని ఆమంచి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈరోజు మీడియాకు విడుదల చేశారు.
బలరాం తన నామినేషన్ పత్రంలో తప్పుడు సమాచారం ఇచ్చారనేది ఆమంచి ఆరోపణ. భార్యతో పాటు తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా దాచిపెట్టారని ఆమంచి చెప్పారు. నామినేషన్ పేపర్‌లో తన భార్య పేరు కరణం సరస్వతిగా పేర్కొన్నారు. అయితే ఆయనకు మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదని ఆయన కొన్ని ఫోటోలు విడుదల చేశారు.
1985లోనే కాట్రగడ్డ ప్రసూనతో బలరాం వివాహం శ్రీశైలంలో జరిగిందని… వారికి 1989లో అంబిక కృష్ణ అనే అమ్మాయి హైదరాబాద్‌లోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో జన్మించిందని ఆమంచి తెలిపారు.
అంబిక పదో తరగతి సర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌కార్డులో తండ్రి పేరు బలరామకృష్ణమూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, తొలి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫోటోల్లో బలరాం ఉన్నారు.
అంబికా తన కూతురు కాదని బలరాం ఏ పరీక్షకైనా సిద్దమా అని…. ఆమంచి సవాల్ విసిరారు. ఫోరెన్సిక్, డీఎన్ఏ వంటి సైంటిఫిక్ పరీక్షలకు కూడా అంబికా సిద్ధంగా ఉందని…. బలరాం మరి మీరు సిద్దమా? అని ఆమంచి సవాల్ విసిరారు.
కన్న కూతురి పేరు కూడా అఫిడవిట్‌లో పెట్టని కఠినమైన వ్యక్తి బలరాం అని ఆమంచి విమర్శించారు. బలరాం అంటే భయంతోనే అంబికా ఇన్ని రోజులు బయటకు రాలేదని..కానీ ఇప్పుడు అండ దొరకడంతో ఆమె బయటకు వచ్చారని తెలిపారు.