"మ్యావ్... మ్యావ్" అంటున్న చింతమనేని
ఓటమి తర్వాత చింతమనేని ప్రభాకర్ వైరాగ్యానికి గురవుతున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్నుమిన్ను కానరాకుండా సామాన్యుల నుంచి పోలీసుల పై కూడా దాడులకు తెగబడిన చింతమనేని ఇప్పుడు మాత్రం తానో బుద్దిమంతుడిగా బతకాలనుకుంటున్నానని చెబుతున్నాడు. వనజాక్షిపై దాడి తర్వాత చింతమనేని సంగతి అందరికీ తెలిసిపోయింది. కానీ చంద్రబాబు కనీసం మందలించకపోవడంతో చింతమనేని ఐదేళ్లూ రెచ్చిపోతూనే వచ్చాడు. తనను ఓడించడం ఎవరితరం కాదంటూ కోతలు కోశాడు. కానీ వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత చింతమనేని పెద్దగా యాక్టివ్‌గా […]
ఓటమి తర్వాత చింతమనేని ప్రభాకర్ వైరాగ్యానికి గురవుతున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్నుమిన్ను కానరాకుండా సామాన్యుల నుంచి పోలీసుల పై కూడా దాడులకు తెగబడిన చింతమనేని ఇప్పుడు మాత్రం తానో బుద్దిమంతుడిగా బతకాలనుకుంటున్నానని చెబుతున్నాడు.
వనజాక్షిపై దాడి తర్వాత చింతమనేని సంగతి అందరికీ తెలిసిపోయింది. కానీ చంద్రబాబు కనీసం మందలించకపోవడంతో చింతమనేని ఐదేళ్లూ రెచ్చిపోతూనే వచ్చాడు. తనను ఓడించడం ఎవరితరం కాదంటూ కోతలు కోశాడు. కానీ వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరి చేతిలో ఓడిపోయాడు.
ఆ తర్వాత చింతమనేని పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. పొలం వద్ద 200 గేదెలను కాసుకుంటున్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. ఎవరినీ కలిసేందుకు కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా నో చెబుతున్నాడు. ‘మీడియా వల్లే నేను నాశనం అయిపోయా… కాబట్టి నన్ను వదిలేయండి’ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారాయన. ఇకపై తాను వివాదాల జోలికి వెళ్లబోనంటున్నాడు.
ఇప్పటికే ఉన్న కేసులతో పోరాటం చేయడానికి తనకు జీవిత కాలం సరిపోతుందని… కొత్తగా తలనొప్పులు వద్దంటున్నాడు. ఇటీవల పోలవరం కాలువ వద్ద రైతులకు నీరందించే పైపులను చింతమనేని ఎత్తుకెళ్లాడు. దానిపై రైతులు కేసు పెట్టారు. దాంతో పోలీసులు చింతమనేని ఇంటికి వెళ్లగా… ఆ పైపులు గతంలో తానే కొనుగోలు చేశానని… కానీ ఇప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదని… పైపులు తీసుకెళ్లండి అంటూ పోలీసులకు అప్పగించేశాడు.
ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఎగిరిపడ్డ చింతమనేని ఇప్పుడు మాత్రం సాధుజీవిగా బతుకుతానంటున్నాడు. పవర్‌లో ఉన్నప్పుడు తానో చిరుతపులిని అని ఫోజు కొట్టిన చింతమనేని ఇప్పుడు మాత్రం పిల్లిలా మారిపోవడం తో నియోజకవర్గం ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.