డీఎస్పీ రమేష్‌ అసభ్య ప్రవర్తన... వేటు వేసిన సవాంగ్

గుంటూరు అర్బన్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో డీఎస్పీగా పనిచేస్తున్న రమేష్ కుమార్‌పై వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ రమేష్‌ కుమార్‌ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇటీవల మేడికొండూరుకు చెందిన ఒక వివాహిత తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సిలింగ్ కోసం మహిళా స్టేషన్‌కు సిఫార్సు చేశారు. పదేపదే ఆమెను స్టేషన్‌కు పిలిపిస్తూ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం […]

Advertisement
Update:2019-07-06 04:06 IST

గుంటూరు అర్బన్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో డీఎస్పీగా పనిచేస్తున్న రమేష్ కుమార్‌పై వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

డీఎస్పీ రమేష్‌ కుమార్‌ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇటీవల మేడికొండూరుకు చెందిన ఒక వివాహిత తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సిలింగ్ కోసం మహిళా స్టేషన్‌కు సిఫార్సు చేశారు.

పదేపదే ఆమెను స్టేషన్‌కు పిలిపిస్తూ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు డీఎస్పీ. తనకు సహకరిస్తే అంతా తాను చూసుకుంటానంటూ వేధించాడు.

డీఎస్పీ వేధింపులను సాక్ష్యాలతో సహా నిరూపించాలని భావించిన 32 ఏళ్ల మహిళ… డీఎస్పీ తనను తాకరాని చోట తాకేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలను రికార్డు చేసింది.

ఈ వీడియో ఆధారంగా జూన్ 10న స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. డీఎస్పీ రమేష్ కుమార్‌ అనుచిత ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు కూడా ఉండడంతో అతడిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణకు ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News