జూన్ బాక్సాఫీస్ రివ్యూ
జూన్ నెలలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. అయితే చిన్న చిత్రాలుగా వచ్చిన సినిమాలు కొన్ని అద్భుతంగా మెరిశాయి. జూన్ మొదటి వారంలో సెవెన్, హిప్పీ, కిల్లర్ లాంటి 5 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. ట్రయిలర్స్ తో అంచనాలు పెంచిన సెవెన్, హిప్పీ సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. విజయ్ ఆంటోనీ, అర్జున్ హీరోలుగా నటించిన కిల్లర్ సినిమా బాగున్నప్పటికీ, థియేటర్లలో నిలబడలేకపోయింది. రెండో వారంలో గేమ్ ఓవర్ మెరిసింది. తాప్సి లీడ్ రోల్ […]
జూన్ నెలలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. అయితే చిన్న చిత్రాలుగా వచ్చిన సినిమాలు కొన్ని అద్భుతంగా మెరిశాయి. జూన్ మొదటి వారంలో సెవెన్, హిప్పీ, కిల్లర్ లాంటి 5 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. ట్రయిలర్స్ తో అంచనాలు పెంచిన సెవెన్, హిప్పీ సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. విజయ్ ఆంటోనీ, అర్జున్ హీరోలుగా నటించిన కిల్లర్ సినిమా బాగున్నప్పటికీ, థియేటర్లలో నిలబడలేకపోయింది.
రెండో వారంలో గేమ్ ఓవర్ మెరిసింది. తాప్సి లీడ్ రోల్ పోషించిన ఈ హారర్ సినిమా చాలామందికి కనెక్ట్ అయింది. నిజాయితీగా చేసిన ఈ ప్రయత్నాన్ని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ఈ మూవీతో పాటు వచ్చిన మిగతా 3 చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. నందిత రాజ్ నటించిన విశ్వామిత్ర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు సప్తగిరి నటించిన వజ్రకవచధర గోవింద, ఉపేంద్ర నటించిన డబ్బింగ్ మూవీ ఐలవ్ యు డిజాస్టర్లుగా నిలిచాయి.
ఇక మూడో వారంలో ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటితో బాగా మెరిసిన చిత్రం ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ. సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమా ఇదే. ఈ మూవీతో పాటు వచ్చిన మల్లేశం సినిమా ఓ మంచి చిత్రంగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ వసూళ్లు మాత్రం లేవు. అదే వారం రిలీజైన గజేంద్రుడు, స్పెషల్, ఓటర్, ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాలు వచ్చిన మొదటి రోజుకే దుకాణం సర్దేశాయి.
జూన్ ఆఖరి వారంలో కెప్టెన్ రాణా ప్రతాప్, కల్కి, బ్రోచేవారెవరురా సినిమాలు విడుదలయ్యాయి. వీటితో బ్రోచేవారెవరురా సినిమా పెద్ద హిట్ అయింది. శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ వారం విడుదలైన 3 సినిమాల్లో అందరి చూపు కల్కిపై ఉండేది. కానీ అది నిరాశపరిచింది. బ్రోచేవారెవరురా హిట్ అయింది. ఇక కెప్టెన్ రానా ప్రతాప్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇలా జూన్ లో వచ్చిన చిన్న సినిమాల్లో బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సూపర్ హిట్ అవ్వగా.. కల్కి సినిమా ఓ మోస్తరుగా ఆడుతోంది. మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.