మై హోమ్ రామేశ్వర్‌రావు ఇంట్లో ఐటీ సోదాలు !
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ వార్త కలకలం రేపుతోంది. మై హోమ్ గ్రూపు చైర్మన్ రామేశ్వర్‌రావు ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఆయన ఇంటితో పాటు ఆయనకు చెందిన ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 వేల కోట్ల టర్నోవర్ కలిగిన మై హోమ్ గ్రూపు… రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, సిమెంట్‌తో పాటు ఇతర కంపెనీలను నిర్వహిస్తోంది. ఇటీవలే టీవీ9 మీడియాను కొనుగోలు చేసింది. అప్పటినుంచి మైహోమ్ గ్రూపు […]
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ వార్త కలకలం రేపుతోంది. మై హోమ్ గ్రూపు చైర్మన్ రామేశ్వర్‌రావు ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఆయన ఇంటితో పాటు ఆయనకు చెందిన ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 40 వేల కోట్ల టర్నోవర్ కలిగిన మై హోమ్ గ్రూపు… రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, సిమెంట్‌తో పాటు ఇతర కంపెనీలను నిర్వహిస్తోంది. ఇటీవలే టీవీ9 మీడియాను కొనుగోలు చేసింది. అప్పటినుంచి మైహోమ్ గ్రూపు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఐటీ రైడ్స్‌తో రామేశ్వరరావు మరోసారి వార్తల్లోకి వచ్చారు.
ఇతర ఫిర్యాదుల మేరకు ఐటీ రైడ్స్ జరుపుతున్నారా? రోటీన్‌గా ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పాగా కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వ్యాపారవేత్త రామేశ్వరరావు, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ కు గట్టి సంకేతాలు పంపేందుకే జూపల్లి రామేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారా? అనేది రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.