ఏపీలో అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ నూతన మిషన్ తో రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. సోమవారం నాడు జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అగ్రికల్చర్ మిషన్ కు […]

Advertisement
Update:2019-07-02 03:30 IST

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేశారు.

ఈ నూతన మిషన్ తో రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. సోమవారం నాడు జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అగ్రికల్చర్ మిషన్ కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ మిషన్ కు వైస్ చైర్మన్ గా వై. వి.ఎస్. రెడ్డిని నియమించారు.

నూతనంగా ఏర్పడిన అగ్రికల్చర్ మిషన్ లో వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా సభ్యులుగా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ అగ్రికల్చర్ మిషన్ లో రైతులను కూడా భాగస్వామ్యం చేశారు ముఖ్యమంత్రి. మిషన్ లో సభ్యులుగా రైతులు రాఘవరెడ్డి, బోయ నరేంద్ర, రామారావు కొనసాగుతారు. నూతనంగా ఏర్పడిన ఈ అగ్రికల్చర్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లో రైతుల స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేసి రైతులకు దిశానిర్దేశం చేస్తుంది.

క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ విత్తనాల పంపిణీతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమ ప్రభుత్వం రైతు సానుకూల ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షగా చెబుతున్నారు. ఆ కలను సాకారం చేసేందుకు నూతనంగా ఏర్పాటైనదే అగ్రికల్చర్ మిషన్ అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News