వాల్మీకి షూటింగ్ ఆగిపోయింది.. కారణం అదే!

వాల్మీకి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ వివాదం మొదలైన విషయం తెలిసిందే. వాల్మీకి తెగకు చెందిన వాళ్లు ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరం వ్యక్తంచేశారు. టైటిల్ వాడుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ టైటిల్ లో తుపాకి బొమ్మ పెట్టడం మాత్రం తమకు ఇష్టంలేదని ప్రకటించారు. దీనిపై అప్పట్లో కాస్త గందరగోళం కూడా చెలరేగింది. కానీ యూనిట్ ఆ వ్యతిరేకతను బలవంతంగా అణచివేయగలిగింది. అయితే ఈసారి మాత్రం వాల్మీకి యూనిట్ కు తీవ్ర ప్రతిఘటన […]

Advertisement
Update:2019-07-02 10:02 IST

వాల్మీకి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ వివాదం మొదలైన విషయం తెలిసిందే. వాల్మీకి తెగకు చెందిన వాళ్లు ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరం వ్యక్తంచేశారు.

టైటిల్ వాడుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ టైటిల్ లో తుపాకి బొమ్మ పెట్టడం మాత్రం తమకు ఇష్టంలేదని ప్రకటించారు. దీనిపై అప్పట్లో కాస్త గందరగోళం కూడా చెలరేగింది. కానీ యూనిట్ ఆ వ్యతిరేకతను బలవంతంగా అణచివేయగలిగింది.

అయితే ఈసారి మాత్రం వాల్మీకి యూనిట్ కు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. అనంతపురం జిల్లాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది వాల్మీకి యూనిట్. ఈ విషయం తెలుసుకున్న ఆ జిల్లా వాల్మీకి కులస్థులు, షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు. షూటింగ్ ను అడ్డుకున్నారు.

ఇలా ఒక రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా 3 రోజుల పాటు షూటింగ్ ను అడ్డుకున్నారు. దీంతో చేసేదేం లేక వాల్మీకి సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. యూనిట్ అంతా హైదరాబాద్ తిరుగుపయనమైంది.

దర్శకుడు హరీష్ కు ఇలాంటి వివాదాలేం కొత్తకాదు. గతంలో ఈ డైరక్టర్ చేసిన డీజే సినిమా బ్రాహ్మాణుల ఆగ్రహానికి గురైంది. ఓ రొమాంటిక్ సాంగ్ లో అగ్రహారానికి సంబంధించిన పదాలు వాడడం, వాటిని శృంగారాత్మకంగా చిత్రీకరించడాన్ని బ్రాహ్మాణులు భరించలేకపోయారు. దీంతో ఆ పాట సాహిత్యాన్ని మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు వాల్మీకి సినిమాకు సంబంధించి కూడా టైటిల్ లో మార్పులు తప్పేలా లేవు.

Tags:    
Advertisement

Similar News