సోషల్ మీడియాలో శృతి మించిన మహిళా నెటిజన్ల తిట్లు
సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ నెటిజన్ల మధ్య మళ్లీ వార్ మొదలైంది. అయితే ఈసారి టీడీపీ నెటిజన్లు అసూయ, ద్వేషంతో కూడిన పోస్టులు పెడుతున్నారు. టీడీపీ సానుభూతిపరులైన మహిళలే ఇలాంటి పోస్టులు ఎక్కువగా పెడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా, ఏపీ హోంమంత్రి సుచరితపైనా, ఇతర మంత్రులపైనా దారుణమైన పోస్టులు పెడుతున్నారు. ముగ్గురు నలుగురు పిల్లల తల్లులు, 50 ఏళ్లకు పైబడిన టీడీపీ మహిళలు కూడా జగన్ మోహన్ రెడ్డి ఉండకూడదని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. కొందరు […]
సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ నెటిజన్ల మధ్య మళ్లీ వార్ మొదలైంది. అయితే ఈసారి టీడీపీ నెటిజన్లు అసూయ, ద్వేషంతో కూడిన పోస్టులు పెడుతున్నారు. టీడీపీ సానుభూతిపరులైన మహిళలే ఇలాంటి పోస్టులు ఎక్కువగా పెడుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా, ఏపీ హోంమంత్రి సుచరితపైనా, ఇతర మంత్రులపైనా దారుణమైన పోస్టులు పెడుతున్నారు. ముగ్గురు నలుగురు పిల్లల తల్లులు, 50 ఏళ్లకు పైబడిన టీడీపీ మహిళలు కూడా జగన్ మోహన్ రెడ్డి ఉండకూడదని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
కొందరు వైఎస్ లాగే జగన్ కూడా హెలికాప్టర్ ప్రమాదానికి గురికావాలంటూ బహిరంగంగానే ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అలా జరిగితే వంద టెంకాయలు కొడుతాం అంటూ టీడీపీ మహిళలు రెచ్చిపోతున్నారు. టీడీపీ నుంచి మగాళ్ల కంటే ఆడవాళ్లు ముందు వరుసలో ఉన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో.
ఇలా ముఖ్యమంత్రి చావు కోరుతూ పోస్టులు పెట్టిన టీడీపీ మహిళలకు ఆ తర్వాత ప్రశాంతత లేకుండాపోతోంది. ఉన్మాదంతో టీడీపీ మహిళలు పెట్టిన ఈ పోస్టులకు వైసీపీ నెటిజన్లు, ఇతర తటస్తుల నుంచి ఊహించని ఎదురుదాడి జరుగుతోంది. ముఖ్యమంత్రి చావు కోరుతూ పోస్టులు పెట్టిన మహిళలకు సంబంధించిన ఫొటోలను, వారి వివరాలను, వారి కుటుంబసభ్యుల వివరాలను ఇతర నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉతికి ఆరేస్తున్నారు.
అటు టీడీపీకి చెందిన కొందరు నెటిజన్లు ఏపీ హోంమంత్రి పైనా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల నారా లోకేష్‌కు హోంమంత్రి సుచరిత గట్టిగా కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో… తట్టుకోలేని టీడీపీ నెటిజన్లు నోటికొచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు.
ఏపీ హోంమంత్రి సుచరితను రేప్ చేస్తామంటూ ఒక నెటిజన్ బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇలాంటి పోస్టులు టీడీపీ ఫేస్ బుక్ పేజీల్లో కూడా భారీగా దర్శనమిస్తున్నాయి. హోంమంత్రిపై ఇదే తరహాలో నీచమైన వ్యాఖ్యలు చేసిన రాజ్ మహరాజ్ అనే టీడీపీ నెటిజన్‌పై దళిత సంఘాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.
అయితే ముఖ్యమంత్రి హెలికాప్టర్ గురించి, హోంమంత్రి గురించి ఇలా బహిరంగంగా పోస్టులు పెడుతున్నా సరే అటు వైసీపీ నుంచి గానీ, ఇటు ప్రభుత్వం నుంచి గానీ అధికారికంగా ఎలాంటి స్పందన లేదు.
ఏపీలో నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో వచ్చి చెప్పే వరకు సీఎం భద్రతపైనా, హోంమంత్రి పైనా ఈ తరహా వ్యాఖ్యలు పలువురు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదన్న చర్చ నడుస్తోంది.