చంచల్‌గూడ జైలు నుంచి తిరుపతన్న రిలీజ్
మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 10 నెలల పాటు జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్ మంజూరు సందర్భంగా తిరుపతన్నకు సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.ట్రయల్‌కు పూర్తిగా సహకరించాలి, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Advertisement