ఆ స్నికర్స్ ధర చూసి ఆశ్చర్యపోయిన రిషీ కపూర్..!
సినిమా యాక్టర్లదేముంది.. మస్తు డబ్బులుంటాయ్.. ఏది కావాలంటే అది కొనుక్కుంటారు. డబ్బులను నీళ్లలా వెదజల్లుతారని అందరూ అనుకుంటారు. కానీ అందరూ అలా ఉండరు. సామాన్యుల్లాగానే ధరలు చూసి వస్తువులు కొంటుంటారు. ఒక సారి అమితాబ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే…. ఎంత డబ్బుంటే మాత్రం సబ్బు టాయిలెట్ బేసిన్ లో జారి పడితే తీసుకొని మళ్లీ రుద్దుకోమా..? మాకూ చాలా లెక్కలు ఉంటాయని చెప్పారు. Biggest sneaker store I have seen with more […]
సినిమా యాక్టర్లదేముంది.. మస్తు డబ్బులుంటాయ్.. ఏది కావాలంటే అది కొనుక్కుంటారు. డబ్బులను నీళ్లలా వెదజల్లుతారని అందరూ అనుకుంటారు. కానీ అందరూ అలా ఉండరు. సామాన్యుల్లాగానే ధరలు చూసి వస్తువులు కొంటుంటారు.
ఒక సారి అమితాబ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే…. ఎంత డబ్బుంటే మాత్రం సబ్బు టాయిలెట్ బేసిన్ లో జారి పడితే తీసుకొని మళ్లీ రుద్దుకోమా..? మాకూ చాలా లెక్కలు ఉంటాయని చెప్పారు.
Biggest sneaker store I have seen with more than 12,000 styles and models in NY. Shocked to see sneakers sell for $40,000/$27,000/$25,000/$20,000 etc…Most sell for$5,000 and above. pic.twitter.com/a3nY8SLvbB
— Rishi Kapoor (@chintskap) June 27, 2019
ఇప్పుడీ ఉపోద్గాతమంతా ఎందుకంటే.. ఇటీవల న్యూయార్క్ వెళ్లిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. అక్కడ ఒక స్నికర్ (షూస్) స్టోర్‌కి వెళ్లిన ఆయన వాటి రేట్లు చూసి ఆశ్చర్యపోయారు.
ఆ స్టోర్‌లో స్నికర్స్ ప్రారంభ ధరే 3.4 లక్షల రూపాయలు (5వేల డాలర్లు) ఉందంట. అలా ఆయన ఆ స్నికర్స్ పరిశీలించుకుంటూ వెళ్లగా ఒక జత స్నికర్ ధర 27 లక్షల రూపాయలు ఉంది. ఆ ధరలు చూసి రిషీ కపూర్ అవాక్కయ్యారు. వెంటనే ఆ ప్రైజ్ ట్యాగ్స్‌ను ఫొటోలు తీసి ట్విట్టర్లో పెట్టారు. ఆ స్టోర్స్‌లో దాదాపు 12వేల రకాల స్నికర్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.
ఇక ఆయన ఫొటోలను పెట్టి ఒక లైన్ రాశారు. ”ఆ ఫొటోలను జూమ్ చేసి చూడండి మీకు ధరలు కనిపిస్తాయి. వీటిని చూశాక నాకొక వాక్యం గుర్తొచ్చింది.. చెప్పులు బంగారంతో చేసినా వెండితో చేసినా వేసుకోవాల్సింది కాలికే కదా.. క్రేజీ” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
Zoom on to the prices below and see it. Reminded of the saying. “Joota sone ka ho ya chaandi ka-pehna toh jaata hai paon mein” Crazy! pic.twitter.com/6NjemHFtzE
— Rishi Kapoor (@chintskap) June 27, 2019