నాగచైతన్య-సాయిపల్లవి సినిమా పాతదే!

నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైంది. సికింద్రాబాద్ లోని ఓ ఆలయంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ప్రేక్షకుల దృష్టిలో ఇది కొత్త సినిమా అయినప్పటికీ మేకర్స్ దృష్టిలో మాత్రం ఇది పాత సినిమానే. అవును.. ఆల్రెడీ ఒకరితో స్టార్ట్ చేసిన ఈ సబ్జెక్ట్ ను ఇప్పుడు వీళ్లిద్దరితో చేస్తున్నారు. అంతే తేడా. ఫిదా సక్సెస్ తర్వాత కొత్త హీరోహీరోయిన్లతో శేఖర్ కమ్ముల ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా […]

Advertisement
Update:2019-06-29 12:40 IST

నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైంది. సికింద్రాబాద్ లోని ఓ ఆలయంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ప్రేక్షకుల దృష్టిలో ఇది కొత్త సినిమా అయినప్పటికీ మేకర్స్ దృష్టిలో మాత్రం ఇది పాత సినిమానే. అవును.. ఆల్రెడీ ఒకరితో స్టార్ట్ చేసిన ఈ సబ్జెక్ట్ ను ఇప్పుడు వీళ్లిద్దరితో చేస్తున్నారు. అంతే తేడా.

ఫిదా సక్సెస్ తర్వాత కొత్త హీరోహీరోయిన్లతో శేఖర్ కమ్ముల ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ దాదాపు 60శాతం పూర్తయింది. అయితే మూవీ అవుట్-పుట్ పై కమ్ములకు అస్సలు సంతృప్తి లేదట. పైగా హీరోహీరోయిన్ల నంచి సరైన పెర్ఫార్మెన్స్ రాబట్టలేకపోయాడట. దీంతో ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసి అదే కథను ఇప్పుడు నాగచైతన్య-సాయిపల్లవితో స్టార్ట్ చేశారట.

సాధారణంగా ఏ సినిమా చేయాలన్నా కనీసం ఏడాది టైమ్ తీసుకుంటాడు కమ్ముల. కానీ ఈ సినిమాను మాత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇది ఎలా సాధ్యం అంటూ చాలామంది అనుమానపడ్డారు. దీనికి కూడా సమాధానం దొరికింది. కొత్త సినిమాకు సంబంధించి కేవలం నాగచైతన్య-సాయిపల్లవి మధ్య సన్నివేశాలు తీస్తే సరిపోతుంది. మిగతా నటీనటుల సీన్స్ అన్నీ ఇంతకుముందే షూట్ చేసిన షెడ్యూల్స్ నుంచి వాడుకుంటారన్నమాట. అలా ఈ సినిమా తొందరగా రెడీ అవుతుంది.

సినిమాలో మరో చిన్న మార్పు కూడా చేశారు. కథప్రకారం, ఇందులో హీరో డాన్సర్. దాన్ని కూడా కాస్త మార్చి హీరోయిన్ ను డాన్సర్ గా చూపిస్తున్నారు. అంటే, ఈసారి సాయిపల్లవి డాన్సర్ అన్నమాట. ఇలా చిన్నచిన్న మార్పులతో, ఆల్రెడీ షూట్ చేసిన ఫుటేజ్ తో ఈ సినిమాను మరో 5 నెలల్లో థియేటర్లలోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

Tags:    
Advertisement

Similar News