లోక్‌సభలో మరో కోల్‌కతా కాళీ.... నీళ్లు తాగించిన మహిళా ఎంపీ

బెంగాల్ నుంచి తృణముల్ కాంగ్రెస్‌ తరపున గెలిచిన మహిళా ఎంపీ మహువా మొయిత్రా ఇప్పుడు ఒక సంచలనంగా మారారు. ఆమెపై అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ఆమెను ఆకాశానికెత్తుతోంది. తొలిసారి ఎంపీగా గెలిచిన ఆమె… గతంలో లండన్‌లో ఒక ప్రముఖ బ్యాంకులో పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి టీఎంసీలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. కానీ లోక్‌సభలో చేసిన పది నిమిషాల ప్రసంగంతో ఆమె పేరు మార్మోగుతోంది. […]

Advertisement
Update:2019-06-29 07:42 IST

బెంగాల్ నుంచి తృణముల్ కాంగ్రెస్‌ తరపున గెలిచిన మహిళా ఎంపీ మహువా మొయిత్రా ఇప్పుడు ఒక సంచలనంగా మారారు. ఆమెపై అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ఆమెను ఆకాశానికెత్తుతోంది.

తొలిసారి ఎంపీగా గెలిచిన ఆమె… గతంలో లండన్‌లో ఒక ప్రముఖ బ్యాంకులో పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి టీఎంసీలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.

కానీ లోక్‌సభలో చేసిన పది నిమిషాల ప్రసంగంతో ఆమె పేరు మార్మోగుతోంది. బెంగాలీ ప్రజలు గర్వంగా ఆమె మా ఎంపీనే అని చెప్పుకుంటున్నారు. లోక్‌సభలో పది నిమిషాల పాటు ప్రసంగించిన మహువా.. మోడీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. సొంత ప్రజలను పౌరసత్వం నిరూపించుకోమనడం, అల్లరి మూకలతో మూక దాడులు చేయించడం, ప్రభుత్వంలోకి కూడా కాషాయాన్ని చొప్పించడం, మీడియాను గుప్పిట్లో పెట్టుకుని నిరసన గొంతుకలు వినిపించకుండా చేయడం.. ఇదేనా మీ జాతీయ వాదం అంటూ బీజేపీపై మహువా విరుచుకుపడ్డారు.

తొలి ప్రసంగంలోనే ఆమె ధాటిని చూసి బీజేపీ ఎంపీలు పదేపదే అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఆయినా సరే ఆమె తగ్గలేదు. ముందు వాళ్లను కూర్చోబెట్టండి అంటూ స్పీకర్‌కు సూచిస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. మోడీ ప్రభుత్వానికి పాసిజం లక్షణాలన్నీ వచ్చేశాయని ఆరోపించిన ఆమె… పాసిజం తొలి సూచనలకు సంబంధించి అమెరికా మ్యూజియంలో పొందుపరిచిన ఒక పత్రంలోని అంశాలను చదివి వినిపించారు.

నిరసన గొంతులను అణచివేయడం, మీడియాను గుప్పెట్లో పెట్టుకోవడం, ప్రజలను మతం ఆధారంగా విభజించడం, జాతీయ భద్రతను రాజకీయం కోసం వాడుకోవడం, ప్రభుత్వంలోకి ఒక మతాన్ని చొప్పించడం వంటి అవలక్షణాలతో మోడీ ప్రభుత్వం పాసిజం వైపు పరుగులు పెడుతోందని ఆమె నిప్పులు చెరిగారు. చదివిన చదువుకు సంబంధించిన పత్రాలు చూపలేని వారు… పౌరులను మాత్రం పౌరసత్వం నిరూపించుకోమంటున్నారు అంటూ ఆమె సెటైర్లు వేశారు.

మోడీ సర్కార్‌పై పది నిమిషాల పాటు లోక్‌సభలో మహువా చేసిన ప్రసంగాన్ని సర్జికల్ స్ట్రైక్స్‌గా కొందరు అభివర్ణిస్తున్నారు. కోల్‌కతాకు మరో కాళీ దొరికింది అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ప్రసంగానికి అనూహ్యంగా మద్దతు వస్తోంది. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్‌ వాళ్లే చచ్చుబడిన వేళ కావాల్సింది ఇలాంటి గొంతుకలే అని కొందరు నెటిజన్లు ఆమె దూకుడును ఆహ్వానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News