ఆ సినిమా ఎఫెక్ట్..... 2.O వద్దంటున్న చైనీస్ డిస్ట్రిబ్యూటర్లు

2010లో విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన ‘రోబో’ సినిమాకి సీక్వెల్ గా ఈ మధ్యనే ‘2.O’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. తెలుగులో కలెక్షన్లు పక్కనపెడితే తమిళంలో ఈ సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా ను చైనాలో విడుదల చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. […]

Advertisement
Update:2019-06-27 05:37 IST

2010లో విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన ‘రోబో’ సినిమాకి సీక్వెల్ గా ఈ మధ్యనే ‘2.O’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు.

తెలుగులో కలెక్షన్లు పక్కనపెడితే తమిళంలో ఈ సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా ను చైనాలో విడుదల చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రముఖ చైనీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ హెచ్.వై మీడియా ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు, ఈ సినిమా చైనాలో ఏకంగా 60 వేల స్క్రీన్స్ లో విడుదల కానుంది అని కూడా వార్తలు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం హెచ్.వై మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ మాను కొన్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే బాలీవుడ్ సినిమా ప్యాడ్ మాన్ తో హెచ్.వై మీడియా భారీ నష్టాలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంత పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి హెచ్.వై మీడియా సిద్ధంగా లేదట.

పైగా జూలై 19న ‘లయన్ కింగ్’ సినిమా విడుదల అవుతుండటంతో ‘2.0’ సినిమాపై ఎవరూ ఆసక్తి చూపరని హెచ్ వై మీడియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News