ప్రజల మనోభావాలే రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంటులో ఉభయ సభలనుద్దేశించి భారత రాష్ట్ర్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగం దేశ ప్రజల మనోభావాలను తెలియజేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్ సభలో రాష్ట్ర్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో దేశ ప్రజలు తమకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, దేశంలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి స్పష్టమైన తీర్పు రాలేదని చెప్నారు. “ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేం గర్వ పడుతున్నాం. వారి తీర్పును అనుసరించే మేం […]

Advertisement
Update:2019-06-25 16:09 IST

పార్లమెంటులో ఉభయ సభలనుద్దేశించి భారత రాష్ట్ర్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగం దేశ ప్రజల మనోభావాలను తెలియజేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

లోక్ సభలో రాష్ట్ర్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో దేశ ప్రజలు తమకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, దేశంలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి స్పష్టమైన తీర్పు రాలేదని చెప్నారు.

“ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేం గర్వ పడుతున్నాం. వారి తీర్పును అనుసరించే మేం పాలన చేస్తాం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశం అనేక సవాళ్లను ఎదుర్కుంటోందని, వాటన్నింటిని ధీటుగా ఎదుర్కొంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సందర్భంగానే కాకుండా గత ప్రభుత్వంలో కూడా తాము ఇచ్చిన అన్ని హామీలను త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రధాని చెప్పారు. దేశంలో సామాన్యలందరూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలను తామే నెరవేరుస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ప్రధానమంత్రి…. కాంగ్రెస్ పార్టీపైనా, ఇతర ప్రతిపక్షాల పైనా విరుచుకుపడ్డారు. భారత ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయ్, పి.వీ.నరసింహారావు, మన్మోహన్ సింగ్ లను కాంగ్రెస్ పార్టీ ఏనాడు గౌరవించలేదని ప్రధాని అన్నారు.

“మీ హయాంలో వాజ్ పేయిని గౌరవించారా..? చివరకు మీ ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావును కూడా గౌరవించలేదు. మేం వాజ్ పేయ్ కి భారతరత్న ఇచ్చాం. మీ నాయకుడ్ని కూడా మీరు గౌరవించుకోలేని సంస్కారం మీది” అని ప్రధానమంత్రి తీవ్ర స్ధాయిలో దుయ్యబట్టారు.

తమ హయాంలో దేశం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, దేశంలో పేదరిక నిర్మూలనే తమ ముందున్న లక్ష్యమని ప్రధానమంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల అమలులో విపక్షనేతల సలహాలు తీసుకుంటామని, వారిని సంప్రదిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News