కోపా అమెరికా క్వార్టర్స్ లో హేమాహేమీలు

నాకౌట్ రౌండ్లో బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే క్వార్టర్స్ లో పెరాగ్వేతో వెనిజ్వేలా ఢీ ప్రపంచ సాకర్ అడ్డా బ్రెజిల్ గడ్డపై జరుగుతున్న దక్షిణ అమెరికా ఖండ దేశాల సాకర్ సంరంభం కోపా అమెరికా కప్ టోర్నీలో లీగ్ దశ ముగిసి.. క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు రంగం సిద్ధమయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ చిలీ, ఆతిథ్య బ్రెజిల్, మాజీ చాంపియన్ అర్జెంటీనా, ఉరుగ్వే, వెనిజ్వేలా, పరాగ్వే జట్లు…క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి. పోర్టో అలెగ్రీ […]

Advertisement
Update:2019-06-25 05:54 IST
  • నాకౌట్ రౌండ్లో బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే
  • క్వార్టర్స్ లో పెరాగ్వేతో వెనిజ్వేలా ఢీ

ప్రపంచ సాకర్ అడ్డా బ్రెజిల్ గడ్డపై జరుగుతున్న దక్షిణ అమెరికా ఖండ దేశాల సాకర్ సంరంభం కోపా అమెరికా కప్ టోర్నీలో లీగ్ దశ ముగిసి.. క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు రంగం సిద్ధమయ్యింది.

డిఫెండింగ్ చాంపియన్ చిలీ, ఆతిథ్య బ్రెజిల్, మాజీ చాంపియన్ అర్జెంటీనా, ఉరుగ్వే, వెనిజ్వేలా, పరాగ్వే జట్లు…క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.

పోర్టో అలెగ్రీ వేదికగా ముగిసిన గ్రూప్ -బీ ఆఖరి లీగ్ పోటీలో అర్జెంటీనా 2-0 గోల్స్ తో ఖతర్ ను అధిగమించి క్వార్టర్స్ బెర్త్ సంపాదించింది.

మరో లీగ్ పోటీలో కొలంబియా ఒకేఒక్క గోలుతో పరాగ్వే పై నెగ్గడం ద్వారా …రెండువిజయాలతో గ్రూప్ టాపర్ గా నాకౌట్ రౌండ్లో
అడుగుపెట్టింది.

గ్రూప్-ఏ లీగ్ పోటీలో పరాగ్వే 3-1 గోల్స్ తో బొలీవియాను చిత్తు చేసింది. బెలో హారిజాంటో వేదికగా జపాన్-ఈక్వెడార్ జట్ల మధ్య జరిగే ఆఖరి రౌండ్ పోటీలో నెగ్గిన జట్టు… క్వార్టర్ ఫైనల్స్ ఆఖరి బెర్త్ సొంతం చేసుకోగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News