తమ్ముడి సినిమా పై అందుకే విజయ్ మౌనం
స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ త్వరలో నే దొరసాని అనే చిత్రం తో తెరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమా తో రాజశేఖర్ జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక కూడా అరంగేట్రం చేయనుంది. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం అందరి దృష్టి నీ ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ వచ్చింది. అలాగే సినిమా లో ని పాటలు కూడా ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు […]
స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ త్వరలో నే దొరసాని అనే చిత్రం తో తెరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమా తో రాజశేఖర్ జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక కూడా అరంగేట్రం చేయనుంది.
ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం అందరి దృష్టి నీ ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ వచ్చింది. అలాగే సినిమా లో ని పాటలు కూడా ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.
ఇక ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తి కానున్నాయి. ఈ సందర్భం లో విజయ్ దేవరకొండ ఇంకా ఈ సినిమా గురించి ఎందుకు అప్డేట్స్ పోస్ట్ చేయడం లేదు అని అందరిలోనూ ఉంది. ఈ విషయం పై ఇటీవలే ఆనంద్ కూడా స్పందించాడు.
ఆనంద్ ఒక ఆంగ్ల దినపత్రిక కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ…. అసలు తన అన్నయ్య కి దొరసాని ఎలా వచ్చింది అని కానీ… తను ఏం చేస్తున్నాడు అని కానీ తెలియదు అని చెప్పాడు.
సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు ఒంటరిగా కష్ట పడాలి అని విజయ్ మోటివేట్ చేసాడని, తనంతట తానే అందరినీ మెప్పించాలి అని అనుకుంటున్నట్లు ఆనంద్ తెలిపాడు.