బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు మ్యూజిక్ మొదలు

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాకు తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. మొన్నటివరకు బిజీగా ఉన్న తమన్ ఎట్టకేలకు ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం త్రివిక్రమ్-తమన్ మధ్య సంగీత చర్చలు సాగుతున్నాయి. ఓ 3 ట్యూన్స్ ఫైనల్ చేసి, వాటిని బన్నీకి వినిపించబోతున్నారు. అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్-తమన్ కలిశారు. ఆ సినిమాలో తమన్ వర్క్ త్రివిక్రమ్ కు బాగా […]

Advertisement
Update:2019-06-24 00:32 IST

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాకు తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. మొన్నటివరకు బిజీగా ఉన్న తమన్ ఎట్టకేలకు ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం త్రివిక్రమ్-తమన్ మధ్య సంగీత చర్చలు సాగుతున్నాయి. ఓ 3 ట్యూన్స్ ఫైనల్ చేసి, వాటిని బన్నీకి వినిపించబోతున్నారు.

అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్-తమన్ కలిశారు. ఆ సినిమాలో తమన్ వర్క్ త్రివిక్రమ్ కు బాగా నచ్చింది. అందుకే బన్నీ సినిమా కోసం కూడా అతడ్నే తీసుకున్నాడు. అటు బన్నీకి కూడా తమన్ మ్యూజిక్ కొత్తకాదు. అందుకే వెంటనే ఓకే చెప్పేశాడు. కాకపోతే అరవింద సమేత ట్యూన్స్ విషయంలో ఎన్టీఆర్ వేలు పెట్టలేదు. పూర్తిగా త్రివిక్రమ్ కే అధికారం ఇచ్చేశాడు. కానీ ఇక్కడ త్రివిక్రమ్ తో పాటు బన్నీ కూడా ట్యూన్స్ ఫైనల్ చేయాలి. సో.. ఈసారి తమన్ కు వత్తిడి ఇంకాస్త ఎక్కువే.

నిజానికి బన్నీకి ఎలాంటి ట్యూన్స్ నచ్చుతాయో తమన్ కు బాగా తెలుసు. రేసుగుర్రం, సరైనోడు లాంటి సినిమాలకు తమన్ ఇచ్చిన సంగీతం అదిరిపోయింది. కాబట్టి, ఈ కొత్త సినిమాకు కూడా తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు అతడి అభిమానులు. ఆ ప్రక్రియ మొదలైంది.

Tags:    
Advertisement

Similar News