ప్రపంచకప్ సెమీస్ కు చేరువగా భారత్
అప్ఘనిస్థాన్ పై చెమటోడ్చి నెగ్గిన విరాట్ సేన 2010 తర్వాత వన్డేల్లో తక్కువ స్కోరుకే భారత్ అవుట్ వన్డే ప్రపంచకప్ సెమీస్ కు హాట్ ఫేవరెట్, రెండోర్యాంకర్ భారత్ చేరువయ్యింది. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదురౌండ్లలో… భారత్ నాలుగో విజయంతో అజేయంగా నిలిచింది. సౌతాంప్టన్ వేదికగా పసికూన అఫ్గనిస్థాన్ తో ముగిసిన సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ లో భారత్ తుదివరకూ పోరాడి…11 పరుగులతో విజేతగా నిలిచింది. అఫ్గన్ స్పిన్ ట్రాప్ లో భారత్… బ్యాటింగ్ కు […]
- అప్ఘనిస్థాన్ పై చెమటోడ్చి నెగ్గిన విరాట్ సేన
- 2010 తర్వాత వన్డేల్లో తక్కువ స్కోరుకే భారత్ అవుట్
వన్డే ప్రపంచకప్ సెమీస్ కు హాట్ ఫేవరెట్, రెండోర్యాంకర్ భారత్ చేరువయ్యింది. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదురౌండ్లలో… భారత్ నాలుగో విజయంతో అజేయంగా నిలిచింది.
సౌతాంప్టన్ వేదికగా పసికూన అఫ్గనిస్థాన్ తో ముగిసిన సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ లో భారత్ తుదివరకూ పోరాడి…11 పరుగులతో విజేతగా నిలిచింది.
అఫ్గన్ స్పిన్ ట్రాప్ లో భారత్…
బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుకాని హాంప్ షైర్ బౌల్ స్టేడియం వికెట్ పై టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2010 తర్వాత వన్డేల్లో భారత్ 224 పరుగుల స్కోరు సాధించడం ఇదే మొదటిసారి.
కెప్టెన్ కొహ్లీ, మిడిలార్డర్ ఆటగాడు కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీలతో అఫ్ఘన్ బౌలర్లను నిలువరించారు. పేసర్ గుల్బదీన్ నబీ, ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ నబీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బుమ్రా, షమీ మ్యాజిక్…
225 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన అప్ఘన్..ప్రారంభంలో ఆచితూచి ఆడినా ..ఆ తర్వాత ఎదురుదాడి మొదలు పెట్టింది. భారత పేసర్లు, స్పిన్నర్లు సమన్వయంతో బౌల్ చేసినా…మిడిలార్డర్ ఆటగాడు మహ్మద్ నబీ చెలరేగి ఆడి ..విరాట్ సేనలో కలవరం రేపాడు.
నబీ 55 బాల్స్ లో 4 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్లో మ్యాచ్ నెగ్గాలంటే 16 పరుగులు చేయాల్సిన సమయంలో నబీని …షమీ పడగొట్టాడు. ఆ తర్వాతి రెండుబాల్స్ లో టెయిల్ ఎండర్లు అఫ్తాబ్ అలం, ముజీబుర్ రెహ్మాన్ లను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా…షమీ హ్యాట్రిక్ తో భారత్ కు 11 పరుగుల విజయం అందించాడు.
భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన జస్ ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తం రౌండ్లలో నాలుగు విజయాలు సాధించిన భారత్ 9 పాయింట్లతో లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది.