ట్రాఫిక్ భరించలేక మెట్రో ఎక్కిన నితిన్
గత కొంతకాలంగా వరుస డిసాస్టర్లతో సతమతం అవుతున్నాడు యువ హీరో నితిన్. ‘అ ఆ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత విడుదలైన ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు డిజాస్టర్లుగా మారిన సంగతి తెలిసిందే. తన ఆశలన్నీ ప్రస్తుతం ‘భీష్మ’ పైన పెట్టుకున్నాడు నితిన్. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘చలో’ సినిమాలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించిన హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ […]
గత కొంతకాలంగా వరుస డిసాస్టర్లతో సతమతం అవుతున్నాడు యువ హీరో నితిన్. ‘అ ఆ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత విడుదలైన ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు డిజాస్టర్లుగా మారిన సంగతి తెలిసిందే. తన ఆశలన్నీ ప్రస్తుతం ‘భీష్మ’ పైన పెట్టుకున్నాడు నితిన్.
వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘చలో’ సినిమాలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించిన హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా నితిన్ అభిమానులకు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా నితిన్ హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్కగా అభిమానులందరూ చుట్టూ గుమిగూడారు. నితిన్ స్వయంగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ “బయట ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ప్యాకప్ తర్వాత మెట్రో ట్రైన్ ఎక్కాను. చాలా మంచి అనుభవం” అంటూ క్యాప్షన్ కూడా పెట్టి మెట్రో స్టేషన్ లోని తన ఫొటోలను షేర్ చేశాడు నితిన్.
అంతే కాకుండా అక్కడ అభిమానులకు సెల్ఫీలు కూడా ఇచ్చి వారినీ సంతోషపరిచాడు. ఇక ఈ సినిమాతో నితిన్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో ఇంకా వేచి చూడాల్సి ఉంది.
Heavy traffic on roads!!so post pack up i took the metro to beat the traffic!! LOVED the experience?? @HydMetroRail pic.twitter.com/bnyItoBkjq
— nithiin (@actor_nithiin) June 21, 2019