అమలాపాల్ నగ్నత్వం టీజర్ కే పరిమితం

తమిళ్ లో అమలాపాల్ ఓ సినిమా చేసింది. దాని పేరు ఆడై. అంటే ఆడది అని అర్థం. తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించింది. అమలాపాల్ నగ్నంగా కనిపించడమే దానికి కారణం. అమలాపాల్ డేరింగ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరు ఆమె నిబద్ధత చూసి మెచ్చుకుంటున్నారు. ఆ ఒక్క సీన్ కోసం దాదాపు 3 రోజులు కష్టపడిందట అమలాపాల్. అందుకే ఆ సీన్ ను టీజర్ లో కూడా పెట్టారు. అయితే ఇప్పుడీ […]

Advertisement
Update:2019-06-22 01:54 IST

తమిళ్ లో అమలాపాల్ ఓ సినిమా చేసింది. దాని పేరు ఆడై. అంటే ఆడది అని అర్థం. తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించింది. అమలాపాల్ నగ్నంగా కనిపించడమే దానికి కారణం. అమలాపాల్ డేరింగ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరు ఆమె నిబద్ధత చూసి మెచ్చుకుంటున్నారు.

ఆ ఒక్క సీన్ కోసం దాదాపు 3 రోజులు కష్టపడిందట అమలాపాల్. అందుకే ఆ సీన్ ను టీజర్ లో కూడా పెట్టారు. అయితే ఇప్పుడీ సీన్ టీజర్ కే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. సినిమా నుంచి ఈ మొత్తం సన్నివేశాన్ని తొలిగించే అవకాశం ఉంది.

తమిళనాట ఈ సన్నివేశంపై ఇప్పటికే ఆందోళన మొదలైంది. సినిమాలో ఆ సన్నివేశం ఉండడానికి వీల్లేదంటూ కొన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. దీంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. సినిమా ఇంకా సెన్సార్ కు రాలేదు. వస్తే మాత్రం ఆ సీన్ తొలిగించాలని నిర్ణయించారు. మరోవైపు యూనిట్ మాత్రం తమ సినిమాకు ఆ సన్నివేశమే కీలకం అంటున్నారు.

అన్నట్టు ఈ సినిమాకు సంబంధించి తెలుగు పోస్టర్ కూడా విడుదల చేశారు. తెలుగులో దీనికి ‘ఆమె’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Tags:    
Advertisement

Similar News