ఈ వారం ఏకంగా 7 సినిమాలు

ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో సక్సెస్ అయ్యే సినిమాలెన్నో చెప్పలేం కానీ హైప్ ఉన్న మూవీస్ మాత్రం లేవు. ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం నవీల్ పొలిశెట్టి నటించిన సినిమా ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ. గతంలో చిరంజీవి నటించిన చంటబ్బాయ్ షేడ్స్ తో వస్తున్న కామెడీ జేమ్స్ బాండ్ తరహా సినిమా ఇది. ఈమధ్య కాలంలో ఈ జానర్ ఎవరూ టచ్ చేయలేదు. పైగా ప్రమోషన్ కూడా భారీగా చేశారు. సో.. […]

Advertisement
Update:2019-06-21 01:24 IST

ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో సక్సెస్ అయ్యే సినిమాలెన్నో చెప్పలేం కానీ హైప్ ఉన్న మూవీస్ మాత్రం లేవు. ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం

నవీల్ పొలిశెట్టి నటించిన సినిమా ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ. గతంలో చిరంజీవి నటించిన చంటబ్బాయ్ షేడ్స్ తో వస్తున్న కామెడీ జేమ్స్ బాండ్ తరహా సినిమా ఇది. ఈమధ్య కాలంలో ఈ జానర్ ఎవరూ టచ్ చేయలేదు. పైగా ప్రమోషన్ కూడా భారీగా చేశారు. సో.. కాస్త ఎడ్జ్ ఉన్న సినిమా ఇదొక్కటే.

ఈ సినిమాతో పాటు వస్తున్న మరో మూవీ మల్లేశం. ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఓ రియల్ స్టోరీ. ఇప్పటికే ప్రివ్యూల రూపంలో చాలామంది ప్రముఖులు, క్రిటిక్స్ కు ఈ సినిమా చూపించారు. అందరికీ నచ్చింది. కాకపోతే క్లైమాక్స్ వీక్ అంటున్నారు. థియేట్రికల్ గా ఎలా నడుస్తుందనేది ప్రస్తుతానికి ఆసక్తికరం.

ఇక మంచు విష్ణు నటించిన ఓటర్, కన్నడ రీమేక్ ఫస్ట్ ర్యాంక్ రాజు కూడా రేపే థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఓటర్ పై ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవ్. దానికి తగ్గట్టే ప్రచారాన్ని కూడా లైట్ తీసుకున్నారంతా. ఇక ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాలో సరైన కాస్టింగ్ లేకపోవడం లోటు. కానీ కన్నడలో మాత్రం ఇది పెద్ద హిట్.

వీటితో పాటు స్టువర్టుపురం, గజేంద్రుడు, స్పెషల్ అనే సినిమాలు వస్తున్నాయి. వీటిలో అజయ్ నటించిన స్పెషల్ స్ట్రయిట్ మూవీ కాగా, మిగతా రెండూ డబ్బింగ్ సినిమాలు. ఇలా ఒకేసారి 7 సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News