జగన్.... మీరిప్పుడు అధికారపక్షం.... అలాగేనా మాట్లాడేది
దేశంలో రాజకీయ విలువలు పతనమై చాలా కాలమైంది. ఈ పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే…కేంద్రంలో ఘన విజయం సాధించిన మోడీ కూడా మొహమాటం లేకుండా, రాజీనామాలు చేయించకుండానే టీడీపీ ఎంపీలను తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క మోడీనే కాదు గతంలో ఫిరాయింపు బాధితులుగా ఉన్న పార్టీలు అధికారంలోకి రాగానే పక్క పార్టీల వారికి గాలం వేస్తున్నాయి. ఫిరాయింపుల విషయంలో దాదాపు అన్ని పార్టీలదీ యూటర్నే. ఒక్క వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఈ […]
దేశంలో రాజకీయ విలువలు పతనమై చాలా కాలమైంది. ఈ పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే…కేంద్రంలో ఘన విజయం సాధించిన మోడీ కూడా మొహమాటం లేకుండా, రాజీనామాలు చేయించకుండానే టీడీపీ ఎంపీలను తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క మోడీనే కాదు గతంలో ఫిరాయింపు బాధితులుగా ఉన్న పార్టీలు అధికారంలోకి రాగానే పక్క పార్టీల వారికి గాలం వేస్తున్నాయి.
ఫిరాయింపుల విషయంలో దాదాపు అన్ని పార్టీలదీ యూటర్నే. ఒక్క వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను స్నేహం చేస్తున్న వ్యక్తులు, పార్టీల గాలి తనకు సోకకుండా జాగ్రత్తపడుతున్నారు.
తాజాగా ఢిల్లీలో ప్రధాని నిర్వహించిన పార్టీ అధ్యక్షుల సమావేశంలో జగన్ చేసిన ప్రసంగం ఇతర నేతలను ఆలోచింప చేసింది. అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష సభ్యులను ఎలా కొనాలి అని పార్టీలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో జగన్ మాత్రం తాను అధికారంలోకి వచ్చాక కూడా గతంలో ప్రతిపక్ష నేతగా వినిపించిన వాదననే వినిపించారు.
ఫిరాయింపులను నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాలని జగన్ డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలు అసలు పోటీకి అనర్హం చేయాలని సూచించారు.
ఫిరాయింపు ఫిర్యాదులను 90 రోజుల్లోగా పరిష్కరించాలని జగన్ డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకునే పార్టీలపైనే పోటీ నుంచి అనర్హత వేటు వేయాలని జగన్ డిమాండ్ చేశారు.
ఆ సమయంలో అక్కడ కేటీఆర్ కూడా ఉన్నారు. తన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌కు కూడా తాకుతాయని తెలిసినా సరే జగన్ మాత్రం ధైర్యంగా తాను చెప్పాల్సింది చెప్పేశారు.
ఫిరాయింపులకు అడ్డుకట్టవేయాల్సిందేనని జగన్ గట్టిగా డిమాండ్ చేయడంతో… సమావేశంలోని నేతలంతా అధికార పార్టీ ఇలాంటి డిమాండ్ చేయడం ఏమిటబ్బ అన్నట్టు ఫేస్‌లు పెట్టారు.
ప్రస్తుతం… ఫిరాయింపు బాధిత పార్టీగా త్వరలో టీడీపీ మారబోతోంది. అలాంటి టీడీపీ వినిపించాల్సిన డిమాండ్‌ను జగన్ వినిపించడం గొప్పే.