రైతులకు పెన్షన్ ఇస్తాం... " రాష్ట్రపతి రామ్‌నాథ్
అందరితోపాటు ప్రభుత్వం… అందరి కోసం ప్రభుత్వం.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. ఈ ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. 17 వ పార్లమెంటు సమావేశాలలో ఉభయసభలను ఉద్దేశించి గురువారం నాడు రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 2014వ సంవత్సరం ముందు పరిస్థితులను మార్చాలని దేశ ప్రజలు బలంగా విశ్వసించారని, అందుకు అనుగుణంగానే గత లోక్ సభలోనూ, ఈ లోక్ సభలోనూ కూడా […]
అందరితోపాటు ప్రభుత్వం… అందరి కోసం ప్రభుత్వం.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. ఈ ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
17 వ పార్లమెంటు సమావేశాలలో ఉభయసభలను ఉద్దేశించి గురువారం నాడు రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
2014వ సంవత్సరం ముందు పరిస్థితులను మార్చాలని దేశ ప్రజలు బలంగా విశ్వసించారని, అందుకు అనుగుణంగానే గత లోక్ సభలోనూ, ఈ లోక్ సభలోనూ కూడా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపారని ఆయన అన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్రపతి రామ్ నాథ్ చెప్పారు.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా యువత ఎక్కువగా పాల్గొన్నారని, ఇది ప్రభుత్వ అభివృద్ధికి సంకేతమని రాష్ట్రపతి తెలిపారు. లోక్ సభ సభ్యులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వివరించారు.
దేశంలో జల సంరక్షణ చేపట్టడంతో పాటు మరింత పెంచడమే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్రపతి అన్నారు. రైతుల స్థితిగతులను సంపూర్ణంగా మారుస్తామని, 60 సంవత్సరాలు పైబడిన రైతులందరికీ పింఛన్లు ఇస్తామని రాష్ట్రపతి ప్రకటించారు.
ఆయుష్మాన్ భవ పథకం కింద దేశంలో ఇప్పటివరకు 26 కోట్ల మందికి వైద్య చికిత్స అందించామని, దేశవ్యాప్తంగా రెండు కోట్ల పక్కా ఇళ్ళు నిర్మించామని రాష్ట్రపతి ప్రకటించారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు దేశంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పాటు పడుతోందని రాష్ట్రపతి చెప్పారు.