20 ఏళ్ల అమ్మాయిగా మారిపోయిన 70 ఏళ్ల సమంత....

సమంత హీరోయిన్ గా నందినీ రెడ్డి దర్శకత్వంలో లో సౌత్ కొరియన్ సూపర్ హిట్ సినిమా ‘మిస్ గ్రాని’ రీమేక్ గా ‘ఓ బేబీ’ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దర్శకనిర్మాతలు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజేంద్ర ప్రసాద్ తాను 70-ఏళ్ల బేబీ […]

Advertisement
Update:2019-06-20 07:44 IST

సమంత హీరోయిన్ గా నందినీ రెడ్డి దర్శకత్వంలో లో సౌత్ కొరియన్ సూపర్ హిట్ సినిమా ‘మిస్ గ్రాని’ రీమేక్ గా ‘ఓ బేబీ’ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దర్శకనిర్మాతలు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజేంద్ర ప్రసాద్ తాను 70-ఏళ్ల బేబీ (సమంత) ను 20 ఏళ్ల పడుచుగా మారడం చూసాను అని చెప్పడం తో మొదలయ్యే ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది అని అర్థం అవుతోంది.

ట్రైలర్ లాగానే సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్… ప్రేక్షకుల నుండి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. సమంత నటన సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు.

నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జులై 5 న విడుదల కాబోతోంది.

Tags:    
Advertisement

Similar News