లేఖలు ఇచ్చేసిన టీడీపీ ఎంపీలు....

టీడీపీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజ్యసభలో టీడీపీ ఉనికిని కోల్పోతోంది. ఆరుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీకి ఉండగా… వారిలో నలుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటిలు లేఖలు అందజేశారు. తమను ఇకపై టీడీపీ సభ్యులుగా గుర్తించవద్దని కోరారు. ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని లేకుంటే బీజేపీలో విలీనం చేయాలని వెంకయ్యనాయుడిని కలిసి కోరారు. టీడీపీ ఎంపీలతో పాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌ […]

Advertisement
Update:2019-06-20 12:33 IST

టీడీపీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజ్యసభలో టీడీపీ ఉనికిని కోల్పోతోంది. ఆరుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీకి ఉండగా… వారిలో నలుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటిలు లేఖలు అందజేశారు.

తమను ఇకపై టీడీపీ సభ్యులుగా గుర్తించవద్దని కోరారు. ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని లేకుంటే బీజేపీలో విలీనం చేయాలని వెంకయ్యనాయుడిని కలిసి కోరారు. టీడీపీ ఎంపీలతో పాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా వెంకయ్యనాయుడిని కలిశారు. టీడీపీ ఎంపీలు, బీజేపీ పెద్దలు కలిసి వెంకయ్యనాయుడు వద్దకు వెళ్లారు.

టీడీపీ ఎంపీలను ప్రత్యేక బృందంగా గానీ.. లేదా బీజేపీలో విలీనం చేస్తూ గానీ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన వెంకయ్యనాయుడు చేతులు మీదుగానే టీడీపీ కథను తమకు కావాల్సిన విధంగా చక్కగా నడుపుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం బాగుండదు అన్నట్టుగా చంద్రబాబు ముఖం తప్పించి విదేశాలకు వెళ్ళడం కూడా బాగా రక్తి కట్టింది.

Tags:    
Advertisement

Similar News