సరిలేరు నీకెవ్వరు షూటింగ్ అప్ డేట్స్

చాలా రోజుల కిందటే ఈ సినిమా లాంఛ్ అయింది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే హీరో లేడు. మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిపోయాడు. అలా హాలిడే ట్రిప్ కు వెళ్లిన మహేష్, ఎట్టకేలకు హైదరాబాద్ తిరిగొచ్చాడు. నిన్న హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వడంతో, సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. వచ్చేనెల 5 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి మహేష్ అంగీకరించాడు. సాధారణంగా హైదరాబాద్ లో […]

Advertisement
Update:2019-06-18 15:33 IST

చాలా రోజుల కిందటే ఈ సినిమా లాంఛ్ అయింది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే హీరో లేడు. మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిపోయాడు. అలా హాలిడే ట్రిప్ కు వెళ్లిన మహేష్, ఎట్టకేలకు హైదరాబాద్ తిరిగొచ్చాడు. నిన్న హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వడంతో, సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. వచ్చేనెల 5 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి మహేష్ అంగీకరించాడు.

సాధారణంగా హైదరాబాద్ లో షూటింగ్ ఉంటే ఇంత గ్యాప్ వచ్చేది కాదు. మరో 2 రోజుల్లో సెట్స్ పైకి వచ్చేయొచ్చు. కానీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కశ్మీర్ లో ప్లాన్ చేశారు. మూవీలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు మహేష్. అది కూడా సినిమా మొత్తం కాదు, ఓ పోర్షన్ లో భాగమే. ఆ షూటింగ్ కోసమే కశ్మీర్ వెళ్తున్నారు.

3వ తేదీ నుంచే కశ్మీర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని మాంటేజ్ షాట్స్ తీస్తారు. ఆ తర్వాత 2 రోజులకు సెట్స్ లో జాయిన్ అవుతాడు మహేష్. మొదటి షెడ్యూల్ నే భారీగా సెట్ చేశారు. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతోంది. మిగతా షెడ్యూల్స్ ను కూడా ఇలానే ప్లాన్ చేశారు.

సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలంటే ఈమాత్రం కష్టపడాల్సిందే. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించనుంది. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు.

Tags:    
Advertisement

Similar News