కరకట్ట అక్రమ నివాసాలను ఖాళీ చేయిస్తాం

చంద్రబాబు రాజ్యం పోయింది.. రాజకీయం పోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైసీపీపై ప్రయోగించిన అస్త్రాలు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. అయితే చట్టప్రకారమే తాము అంతా చేస్తామని అంటున్నారు. అమరావతి రాజధాని పేరుతో భూమాయ చేసిన చంద్రబాబును వదలమని ఇప్పటికే జగన్ ప్రకటించారు. అమరావతిలోని అక్రమ భూములు, నివాసాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో […]

Advertisement
Update:2019-06-18 08:07 IST

చంద్రబాబు రాజ్యం పోయింది.. రాజకీయం పోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైసీపీపై ప్రయోగించిన అస్త్రాలు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. అయితే చట్టప్రకారమే తాము అంతా చేస్తామని అంటున్నారు.

అమరావతి రాజధాని పేరుతో భూమాయ చేసిన చంద్రబాబును వదలమని ఇప్పటికే జగన్ ప్రకటించారు. అమరావతిలోని అక్రమ భూములు, నివాసాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు మొదలైనట్టే కనిపిస్తోంది.

తాజాగా మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణ నది ఒడ్డున కట్టుకున్న అక్రమ నివాసం నుంచి ఆయనను ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికీ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా తాను సీఎంగా ఉన్నప్పుడు ఉన్న అదే నివాసంలో ఉంటానని ఇటీవల జగన్ సర్కారుకు లేఖ రాశారు. అయితే అది కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన భవనం.. అందుకే దీన్ని ఖాళీ చేయిస్తామని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల పేర్కొనడం సంచలనంగా మారింది.

రాజధానిలో సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా చంద్రబాబు ఇలా అక్రమ ఇంట్లో ఉండడం సిగ్గుచేటన్నారు.

రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంపై కూడా ఆళ్ల స్పందించారు. ఎక్సెస్ టెండర్ల వల్లే ఇలా వైసీపీ ప్రభుత్వం రివ్యూ చేస్తోందని.. కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. సీఆర్డీఏ చైర్మన్ గా ఉన్న జగనే ఇవన్నీ సమీక్షిస్తారన్నారు.

Tags:    
Advertisement

Similar News