శర్వానంద్ కు శస్త్రచికిత్స

షూటింగ్ లో భాగంగా పారా గ్లయిడింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన శర్వానంద్ కు ఈరోజు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్ గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న డాక్టర్ గురవారెడ్డి, శర్వానంద్ కు ఆపరేషన్ నిర్వహించారు. పారా గ్లైడింగ్ లో ల్యాండింగ్ సజావుగా లేకపోవడంతో శర్వా భుజానికి తీవ్ర గాయమైంది. ఇంకా చెప్పాలంటే అతడి భుజం స్థానభ్రంశం చెందింది. దాన్ని వైద్యులు సర్జరీతో సరిదిద్దారు. 2 నెలల పాటు రెస్ట్ అవసరమని సూచించారు. శర్వానంద్ చేతులకు, ముఖానికి కూడా […]

Advertisement
Update:2019-06-17 11:15 IST

షూటింగ్ లో భాగంగా పారా గ్లయిడింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన శర్వానంద్ కు ఈరోజు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్ గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న డాక్టర్ గురవారెడ్డి, శర్వానంద్ కు ఆపరేషన్ నిర్వహించారు.

పారా గ్లైడింగ్ లో ల్యాండింగ్ సజావుగా లేకపోవడంతో శర్వా భుజానికి తీవ్ర గాయమైంది. ఇంకా చెప్పాలంటే అతడి భుజం స్థానభ్రంశం చెందింది. దాన్ని వైద్యులు సర్జరీతో సరిదిద్దారు. 2 నెలల పాటు రెస్ట్ అవసరమని సూచించారు. శర్వానంద్ చేతులకు, ముఖానికి కూడా దెబ్బలు తలిగాయి. కానీ అవన్నీ చిన్న గాయాలే.

తాజా ప్రమాదంతో శర్వానంద్ సినిమాలన్నీ వాయిదాపడ్డాయి. దిల్ రాజు బ్యానర్ పై అతడు నటిస్తున్న 96 సినిమా రీమేక్ ను 2నెలల పాటు వాయిదా వేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. అదింకా స్టార్ట్ కాలేదు. అది కూడా ఆలస్యం కానుంది.

మరోవైపు శర్వానంద్ నటించిన రణరంగం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్ట్ 2న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈలోగా 2 భారీ ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేశారు. వాటికి శర్వానంద్ వచ్చేది అనుమానమే. విడుదలకు ముందు మాత్రం ఆయన మీడియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ కు విజయవంతంగా ఆపరేషన్ పూర్తయినట్టు ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News