మోడీ ఎత్తుగడతో ప్రాంతీయ పార్టీలకు చెక్‌

జమిలీ ఎన్నికలు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ గత ప్రభుత్వంలోనే చట్టం చేయాలని ఆలోచించారు. కానీ పలు రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో అది సాధ్యంకాలేదు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ ఈ పాశుపతాస్త్రాన్ని బయటకు తీసుకున్నారు. అయితే మోడీ జమిలీ అస్త్రం ప్రాంతీయ పార్టీలను కబళించే ఎత్తుగడగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మోడీ […]

Advertisement
Update:2019-06-17 06:27 IST

జమిలీ ఎన్నికలు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ గత ప్రభుత్వంలోనే చట్టం చేయాలని ఆలోచించారు. కానీ పలు రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో అది సాధ్యంకాలేదు.

ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ ఈ పాశుపతాస్త్రాన్ని బయటకు తీసుకున్నారు.

అయితే మోడీ జమిలీ అస్త్రం ప్రాంతీయ పార్టీలను కబళించే ఎత్తుగడగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మోడీ కోసం నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చి తెలంగాణలో బీజేపీని గెలిపించారు. ఇదే తెలంగాణలో ఏకకాలంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగితే జాతీయకోణంలో బీజేపీ లాభపడే అవకాశాలు.. అదే సమయంలో టీఆర్ఎస్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా మోడీ మేనియాను గ్రహించి ముందస్తుకు వెళ్లారని విశ్లేషణలు సాగాయి.

ఇప్పుడు మోడీ ప్రభుత్వం గనుక జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లు జాతీయ కోణంలో ప్రాంతీయ పార్టీలకే ఓట్లు వేయని పరిస్థితి ఎదురు కావచ్చు. అందుకే మోడీ ఎత్తుగడను ముందే పసిగట్టిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దేశంలో జమిలి ఎన్నికలని వ్యతిరేకించే అవకాశాలున్నాయి.

కేసీఆర్, మమతా, అఖిలేష్ , మాయా సహా దక్షిణాది పార్టీలైన జేడీఎస్ లాంటివి కూడా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకే లాభం అన్న కోణంలో ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అయితే మోడీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.

Tags:    
Advertisement

Similar News