ఏపీ సీఎంతో ట‌చ్‌లో ఉన్న టీడీపీ నేత‌లెవ‌రు?

ఏపీ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాంబు పేల్చారు. ఒక్క‌సారి తాను గేట్లు తెరిస్తే టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండ‌ర‌నేది ఆ బాంబు అర్ధం. కానీ తాను అలా చేయ‌ద‌ల్చుకోలేద‌ని అన్నారు. ఎవ‌రినైనా పార్టీలోకి తీసుకుంటే రాజీనామా చేసిన తర్వాతే తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ ప‌ద‌వుల‌తో పాటు అధికార పదవుల‌కు రాజీనామా చేయాల్సిందేన‌ని చెప్పారు. త‌న‌కు టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని మ‌రో బాంబు పేల్చారు వైఎస్ జగన్. తాను మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని పిలుస్తే […]

Advertisement
Update:2019-06-13 15:28 IST

ఏపీ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాంబు పేల్చారు. ఒక్క‌సారి తాను గేట్లు తెరిస్తే టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండ‌ర‌నేది ఆ బాంబు అర్ధం. కానీ తాను అలా చేయ‌ద‌ల్చుకోలేద‌ని అన్నారు.

ఎవ‌రినైనా పార్టీలోకి తీసుకుంటే రాజీనామా చేసిన తర్వాతే తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ ప‌ద‌వుల‌తో పాటు అధికార పదవుల‌కు రాజీనామా చేయాల్సిందేన‌ని చెప్పారు. త‌న‌కు టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని మ‌రో బాంబు పేల్చారు వైఎస్ జగన్. తాను మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని పిలుస్తే టీడీపీలో ఒక్క నేత కూడా మిగిలే వారు కాద‌ని చెప్పారు.

సీఎం జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్న త‌మ‌ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ‌రు? అనే విష‌యం… ఇప్పుడు చంద్ర‌బాబుకు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవ‌రెవ‌రు వైసీపీకి ట‌చ్‌లోకి వెళ్లారో తెలుసుకోవాల‌ని త‌న టీమ్‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. ఎవ‌రెవ‌రు వైసీపీ పెద్ద‌ల‌ను క‌లిశారు? ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారో? తెలుసుకోవాల‌ని త‌న టీమ్‌ను చంద్ర‌బాబు కోరార‌ని తెలుస్తోంది.

ఐదుగురు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ ట‌చ్‌లోకి వెళ్లార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు ఒక్క‌డే కొంత యాక్టివ్‌గా ఉన్నారు. మిగ‌తా ఎమ్మెల్యేలు అంత‌గా యాక్టివ్‌గా లేన‌ట్లు తెలుస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యేల‌పై చంద్ర‌బాబు నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్‌తో పాటు… బీజేపీతో సంప్రదింపులు చేస్తున్న నేత‌లు ఎవరు? ఎవరెవ‌రు డిల్లీ వెళుతున్నారు? అనే విషయాలపై ఆరాతీస్తున్నాడట. అయితే మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

హైద‌రాబాద్‌లో మ‌కాం వేసిన రాంమాధ‌వ్ ను ఏపీకి చెందిన కొంద‌రు నేత‌లు క‌లిసిన‌ట్లు స‌మాచారం.

మొత్తానికి ఇప్పుడు టీడీపీ అధినేతకు మాత్రం భ‌యం పట్టుకుంది. ఎప్పుడు ఏ నేత పార్టీకి గుడ్ బై చెబుతారో అనే ఆందోళ‌న చంద్రబాబులో మొదలైందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News