జగన్ @ పారదర్శకత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇదొక్కటే కాదు. పారదర్శకతకు ప్రతీక అని కూడా అంటున్నారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పారదర్శకత కనిపించడం విశేషం. తాజాగా ఏపీలో గత ప్రభుత్వం పూర్తి చేసిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి విచారణ జరపాలని జగన్ నిర్ణయించారు. తమ ప్రభుత్వంలో జరిగే ప్రతి టెండర్ నూ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆమోద ముద్ర వేసాకే అమలులోకి తెస్తామని సీఎం ఇది వరకే ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే జగన్ […]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇదొక్కటే కాదు. పారదర్శకతకు ప్రతీక అని కూడా అంటున్నారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పారదర్శకత కనిపించడం విశేషం.
తాజాగా ఏపీలో గత ప్రభుత్వం పూర్తి చేసిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి విచారణ జరపాలని జగన్ నిర్ణయించారు. తమ ప్రభుత్వంలో జరిగే ప్రతి టెండర్ నూ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆమోద ముద్ర వేసాకే అమలులోకి తెస్తామని సీఎం ఇది వరకే ప్రకటించారు.
దీనిని బట్టి చూస్తే జగన్ ప్రాజెక్టుల అవినీతిని అరికట్టే విషయంలో ఎంతో స్పష్టతతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా ఇది సాహసోపేతమైన నిర్ణయమేనంటున్నారు.
సాధారణంగా ఏ టెండరు విషయంలోనైనా అవినీతి ఆరోపణలు రావడం సర్వసాధారణంగా మారింది. అందులో నిజమున్నా, లేకపోయినా విషయం మాత్రం ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటోంది. దీంతో అటు రాజకీయ పార్టీలుగానీ, నాయకులుగానీ, ప్రభుత్వం గానీ, ఒక్కోసారి అనవసర నిందలు మోయాల్సి వస్తోంది. కొన్ని వ్యవహారాలు కోర్టు వరకు కూడా వెళ్లి ప్రాజెక్టుల పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
నెలల్లో పూర్తి కావలసిన పనులు కూడా ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. జ్యుడిషియల్ కమిటీ కనుక నియామకమైతే, అన్ని టెండర్లు ఆ కమిటీ దృష్టికి వెళ్లాకే ఆమోదం పొందగలిగితే అది విప్లవాత్మక మార్పునకు నాంది పలికినట్టు అవుతుందనే అభిప్రామాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలు కూడా సానుకూలంగానే స్పందించే అవకాశాలు ఉంటాయని, ఇది ప్రభుత్వానికి ఎంతో మేలు చేకూరుస్తుందని అంటున్నారు. పనులు కూడా చకచకా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ టెండర్ల విషయంలో దేశమంతా ఏపీ వైపు చూసేలా మార్పులు తెస్తామని ప్రకటించారు. దీనిని ఖచ్చితంగా అమలు చేయగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే ఏ నిర్ణయమైనా సక్రమంగా అమలు జరిగి తీరాలంటే అధికార యంత్రాంగం కూడా నిజాయితీగా పని చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్ కఠినంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. రాష్ట్ర్రంలో సీబీఐ ఎంట్రీపై నిషేధాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా జగన్ విశ్వసనీయతను పెంచేదే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.