కోడెల కుమార్తెపై... భూకబ్జా, బలవంతపు వసూళ్ళ కేసు
మొన్ననే కొడుకుపై కేసు పెట్టారు. ఇప్పుడు కూతురు వంతు వచ్చింది. కోడెల ఫ్యామిలీ అవినీతి పుట్ట పగిలే రోజులు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల కోడెల ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసులని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి […]
మొన్ననే కొడుకుపై కేసు పెట్టారు. ఇప్పుడు కూతురు వంతు వచ్చింది. కోడెల ఫ్యామిలీ అవినీతి పుట్ట పగిలే రోజులు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల కోడెల ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసులని ఆశ్రయించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. ఈ భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మీ కన్నుపడింది. నకిలీ పత్రాలను సృష్టించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కబ్జా చేసింది. ఈ పత్రాలను చూపించి అసలు భూమి యజమానులను బెదిరించడం మొదలెట్టారు.
విజయలక్ష్మి దగ్గరికి వెళ్లి ఎంతో కొంత చెల్లిస్తే వ్యవహారం సెటిల్ అవుతుందని ఆమె అనుచరులు బెదిరించారు. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమెను పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారు.
అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి, ఆమె భర్త వెళ్లగా కోడెల కుమార్తె అనుచరులు రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని, లేకుంటే చంపుతామని బెదిరించారు.
దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్ మహ్మద్ షఫీ తెలిపారు.