దేవరకొండను తిడుతున్న నెజిటన్లు

రౌడీ బాయ్ అనే ఇమేజ్ కు సరిగ్గా సరిపోతాడు విజయ్ దేవరకొండ. తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, అనుకున్నది చేయడం ఈ హీరోకు అలవాటు. ఆ రెబల్ యాటిట్యూడ్ తోనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్. ఇలాంటి హీరోకు కూడా సోషల్ మీడియా సెగ తప్పలేదు. తనకు సంబంధం లేకుండానే ఓ విషయంలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు ఈ నటుడు. రీసెంట్ గా ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ అనే సినిమా ట్రయిలర్ ను షేర్ […]

Advertisement
Update:2019-06-08 10:30 IST

రౌడీ బాయ్ అనే ఇమేజ్ కు సరిగ్గా సరిపోతాడు విజయ్ దేవరకొండ. తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, అనుకున్నది చేయడం ఈ హీరోకు అలవాటు. ఆ రెబల్ యాటిట్యూడ్ తోనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్. ఇలాంటి హీరోకు కూడా సోషల్ మీడియా సెగ తప్పలేదు. తనకు సంబంధం లేకుండానే ఓ విషయంలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు ఈ నటుడు.

రీసెంట్ గా ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ అనే సినిమా ట్రయిలర్ ను షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. హీరో గురించి ఓ 2 వాక్యాలు మంచిగా రాసుకొచ్చాడు. ఈ మాత్రం దానికే నెటిజన్లు విజయ్ దేవరకొండను తిట్టడం ప్రారంభించారు. నిజానికి ఇక్కడ కారణం వేరు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు. అతడు నటించిన దొరసాని సినిమా టీజర్ కూడా రిలీజైంది. దాని గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు విజయ్ దేవరకొండ. తమ్ముడి సినిమా టీజర్ ను కూడా షేర్ చేయలేదు. అదే సమయంలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ అనే మరో చిన్న సినిమా ట్రయిలర్ ను షేర్ చేయడంతో నెటిజన్లకు కోపం ముంచుకొచ్చింది.

కానీ ఇక్కడ మేటర్ ఏంటంటే.. తన కుటుంబానికి చెందిన వ్యక్తికి తనే ప్రచారం కల్పిస్తే… ప్రేక్షకులు, విమర్శకులు అపార్థం చేసుకునే అవకాశం ఉండడంతో తమ్ముడి సినిమాకు విజయ్ దేవరకొండ దూరంగా ఉంటున్నాడు. ఈ విషయ తెలియని నెటిజన్లు అతడిపై నోరుపారేసుకుంటున్నారు. తమ్ముడు అంటే ప్రేమ లేదా అంటూ ఆడిపోసుకుంటున్నారు. అదీ సంగతి.

Tags:    
Advertisement

Similar News