ఎప్పుడూ లేని విధంగా.... జగన్‌ మంత్రి వర్గం

యువకుడు, పరిపాలనకు కొత్త అయిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఎంతో అనుభవజ్ఞులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పదవిని చేపట్టిన వారం రోజుల్లోనే పాలనలో తన ముద్ర వేశారు. ఇప్పుడు మంత్రి వర్గ ఏర్పాటులోనూ రాష్ట్రంలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా మూడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం మంత్రి వర్గాన్ని ఒకేసారి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇప్పటివరకు మంత్రి వర్గంలో ఒకరూ లేదా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఈసారి ఏకంగా ఐదుగురు […]

Advertisement
Update:2019-06-07 06:09 IST

యువకుడు, పరిపాలనకు కొత్త అయిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఎంతో అనుభవజ్ఞులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పదవిని చేపట్టిన వారం రోజుల్లోనే పాలనలో తన ముద్ర వేశారు.

ఇప్పుడు మంత్రి వర్గ ఏర్పాటులోనూ రాష్ట్రంలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా మూడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం మంత్రి వర్గాన్ని ఒకేసారి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

ఇప్పటివరకు మంత్రి వర్గంలో ఒకరూ లేదా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఈసారి ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్డీ, కాపుల నుంచి ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పిస్తానని ప్రకటించారు.

అన్నింటికన్నా ముఖ్యమైన మరో నిర్ణయం ఏమిటంటే ఇప్పుడు మంత్రి వర్గంలో చేరే మంత్రులలో 90 శాతం మంది రెండున్నరేళ్ళ తర్వాత మంత్రి వర్గం నుంచి తప్పుకుని…. ఆ స్థానంలో కొత్తవాళ్ళకు అవకాశం కల్పిస్తానని ప్రకటించారు.

ఇంతవరకూ దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు.

Tags:    
Advertisement

Similar News