ఎప్పుడు... ఎవరిని గెలిపించాలో... ఓటేసి చూపించారు
ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 32 జిల్లాల జడ్పీ చైర్మన్ లు.. దాదాపు 60శాతానికి పైగా మండల పరిషత్ లు.. ఏపీలో వైసీపీ సునామీని తలపించేలా తెలంగాణలో పరిషత్ ఎన్నికల వేళ గులాబీ గుబాళింపు అదిరిపోయింది. కేటీఆర్ అన్నట్టు ఇది దేశ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం అయితే.. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు.. నిన్నటి రాష్ట్ర పరిషత్ ఎన్నికలకు మధ్య ఓటర్లు గమనించింది ఒక్కటే.. అదే ప్రాంతీయతత్త్వం.. జాతీయవాదం.. ఈ రెండే టీఆర్ఎస్ ఓటమికి.. గెలుపునకు మధ్య […]
ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 32 జిల్లాల జడ్పీ చైర్మన్ లు.. దాదాపు 60శాతానికి పైగా మండల పరిషత్ లు.. ఏపీలో వైసీపీ సునామీని తలపించేలా తెలంగాణలో పరిషత్ ఎన్నికల వేళ గులాబీ గుబాళింపు అదిరిపోయింది.
కేటీఆర్ అన్నట్టు ఇది దేశ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం అయితే.. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు.. నిన్నటి రాష్ట్ర పరిషత్ ఎన్నికలకు మధ్య ఓటర్లు గమనించింది ఒక్కటే.. అదే ప్రాంతీయతత్త్వం.. జాతీయవాదం.. ఈ రెండే టీఆర్ఎస్ ఓటమికి.. గెలుపునకు మధ్య ఉన్నవి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం.. పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురు.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల గెలుపు.. ఇక నిన్నటి పరిషత్ ఎన్నికల వేళ మళ్లీ టీఆర్ఎస్ కు అపూర్వ విజయం.. దీన్ని బట్టి తెలంగాణ ఓటర్లు తెలివిగా ఆలోచించి ఇచ్చిన తీర్పుగా దీన్ని చెప్పవచ్చు.
అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి తెలంగాణ ఓటర్లు కేవలం రాష్ట్ర కోణంలో ఆలోచించారు. తమ భవిష్యత్ కు టీఆర్ఎస్ ఉంటే లాభమా.? కాంగ్రెస్ ఉంటే మేలా? అని ఆలోచించారు. ఆ ప్రకారం గులాబీ పార్టీని ఎంచుకున్నారు.. ఇక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా జాతీయ కోణంలో కేంద్రంలో ఎవరికి అధికారం ఇవ్వాలని ఆలోచించారు.
పైగా కేసీఆర్ దుందుడుకు చర్యలకు కాసింత బ్రేకులు వేయాలని బీజేపీకి 4, కాంగ్రెస్ 3 సీట్లు ఇచ్చి తెలంగాణలో ప్రజల ఆకాంక్షను చాటిచెప్పేలా తీర్పునిచ్చారు.
ఇక పరిషత్ పూర్తిగా పల్లె ప్రజల తీర్పు. అందుకే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడం.. అభివృద్ధి కావాలంటే గులాబీ నేతలతో అవసరం కావడంతో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో అధికారం కట్టబెట్టారు. ఇలా తెలంగాణ ఓటర్లు సమయం సందర్భాన్ని బట్టి అధికార పార్టీకి వాతపెడుతూ.. కర్తవ్యం గుర్తు చేస్తూ ఇచ్చిన తీర్పులు ఆసక్తి రేపుతున్నాయి.