జగన్‌కు చంద్రబాబు లేఖ

జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి.. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేత. మొన్నటివరకు వీరిద్దరు రివర్స్ లో ఉండేవారు. కానీ ఎవరి సెంటిమెంట్ వారికుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతికి పయనమయ్యాడు. అక్కడ కృష్ణా నది కరకట్ట ఒడ్డున ఉండవల్లి తీరాన ఓ ప్రైవేటు వ్యక్తి అక్రమ కట్టడాన్ని సీఎం నివాసంగా మార్చుకున్నాడు. కోట్లు కుమ్మరించి కావాల్సిన వసతులు కల్పించుకున్నాడు. పక్కనే కృష్ణా నది .. దీంతో ఆహ్లాదంగా గడిపేశాడు. అక్కడే […]

Advertisement
Update:2019-06-05 10:40 IST

జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి.. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేత. మొన్నటివరకు వీరిద్దరు రివర్స్ లో ఉండేవారు. కానీ ఎవరి సెంటిమెంట్ వారికుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతికి పయనమయ్యాడు. అక్కడ కృష్ణా నది కరకట్ట ఒడ్డున ఉండవల్లి తీరాన ఓ ప్రైవేటు వ్యక్తి అక్రమ కట్టడాన్ని సీఎం నివాసంగా మార్చుకున్నాడు. కోట్లు కుమ్మరించి కావాల్సిన వసతులు కల్పించుకున్నాడు.

పక్కనే కృష్ణా నది .. దీంతో ఆహ్లాదంగా గడిపేశాడు. అక్కడే ప్రభుత్వ భూమిలో ప్రజావేదికను నిర్మించి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలను కలుసుకునేవాడు.. భేటీలు నిర్వహించేవాడు…. కానీ ఇప్పుడు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి.. కానీ ఆయన లింగమనేని ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాడు. పక్కనే ఉన్న ప్రభుత్వానికి చెందిన ప్రజా వేదికను తనకోసం అలానే కొనసాగించాలని జగన్ కు చంద్రబాబు లేఖ రాయడం ఆసక్తి రేపుతోంది.

ఇంటి యాజమాన్యం షరతులకు లోబడే ఆ ఇంటిని ఉపయోగించుకుంటున్నట్టు బాబు విజ్ఞప్తి చేశారు.

ఇలా చంద్రబాబు జగన్ కు లేఖ రాయడం.. ఆ కోరికను మన్నించాలని కోరడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షనేత జగన్‌కు ఏ విషయంలోనూ కనీస గౌరవం ఇవ్వలేదు. రాజధాని నిర్మాణానికి ప్రత్యేక విమానంలో వెళ్ళి రామోజీని ఆహ్వానించిన చంద్రబాబు జగన్‌ను ఆహ్వానించలేదు. ఎవరో అధికారిచేత ఆహ్వానం పంపాడు. అలాగే అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడిని అస్సలు పట్టించుకోలేదు. చివరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఆఫీసులు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించే విషయంలో కూడా వైసీపీని ఘోరంగా అవమానించాడు.

ఇప్పుడు ప్లైసులు మారాయి. చంద్రబాబు నాయుడు ఏమాత్రం మొహమాట పడకుండా కోర్కెల చిట్టా విప్పుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News