"సరిలేరు నీకెవ్వరు"..... సోషల్ మీడియా కథ !

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో సూపర్ హిట్ చిత్రం ఏంటి అంటే, ఈ సంవత్సరానికి మహర్షి అంటారు అందరూ. ఈ సినిమా ఇంకా థియేటర్లలో నడుస్తోంది. ఇంతలోనే మహేష్ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రకటించాడు. ఇక ఈ సినిమాకి ”సరిలేరు నీకెవ్వరు” అనే టైటిల్ కూడా పెట్టారు. అయితే ఈ సినిమా కి సంబంధించిన కథ ఇదే అని సోషల్ మీడియా లో ఒక వార్త తిరుగుతుంది. ప్రస్తుతం సోషల్ […]

Advertisement
Update:2019-06-03 08:51 IST

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో సూపర్ హిట్ చిత్రం ఏంటి అంటే, ఈ సంవత్సరానికి మహర్షి అంటారు అందరూ. ఈ సినిమా ఇంకా థియేటర్లలో నడుస్తోంది. ఇంతలోనే మహేష్ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రకటించాడు.

ఇక ఈ సినిమాకి ”సరిలేరు నీకెవ్వరు” అనే టైటిల్ కూడా పెట్టారు. అయితే ఈ సినిమా కి సంబంధించిన కథ ఇదే అని సోషల్ మీడియా లో ఒక వార్త తిరుగుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియా లో, వాట్సాప్ లో తిరుగుతున్న కథనాల ప్రకారం, “హీరో తనతో కలిసి ఆర్మీలో పనిచేసే స్నేహితుడి ఇంటికి వెళ్లాల్సిన పని పడుతుందట…. స్నేహితుడు చనిపోయాడనే వార్త చెబుదామని…. అయితే అక్కడ కొన్ని భాధ్యతలు ఉండటంతో అక్కడే కొంతకాలం ఉండిపోవాల్సి వస్తుందట. ఆ క్రమంలో తన స్నేహితుడు ఫ్యామిలీకి, ఊరికి సహాయం చేయడం వంటి కాన్సెప్ట్ అంట.”

అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకైతే దీని గురించి ఒక అధికారిక ప్రకటన రాలేదు. ఈ నెల లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Tags:    
Advertisement

Similar News