ముద్రగడ రాంగ్ స్టెప్

ఆయన రాజకీయాల్లో ఆరితేరిన రాజకీయ నాయకుడు. మూడు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. జగన్ ఇచ్చిన ఆఫర్ ను కాలదన్ని ఎంపీ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఇలా ఎక్కడ తగ్గాలో కాదు.. ఎటువైపు అడుగులు వేయాలో తెలియక సీనియర్ రాజకీయ వేత్త ముద్రగడ పద్మనాభం నిండా మునిగారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఏపీలో మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత […]

Advertisement
Update:2019-06-03 09:10 IST

ఆయన రాజకీయాల్లో ఆరితేరిన రాజకీయ నాయకుడు. మూడు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. జగన్ ఇచ్చిన ఆఫర్ ను కాలదన్ని ఎంపీ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.

ఇలా ఎక్కడ తగ్గాలో కాదు.. ఎటువైపు అడుగులు వేయాలో తెలియక సీనియర్ రాజకీయ వేత్త ముద్రగడ పద్మనాభం నిండా మునిగారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఏపీలో మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ విడిపోయాక కాపు ఉద్యమాన్ని చేపట్టారు. కాపులకు బాబు హామీలిచ్చి మోసం చేశాడని పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇక మొన్నటి ఎన్నికల వేళ జనసేనకు జైకొట్టారు. తన కాపు సామాజికవర్గమైన జనసేనకే కాపులంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక తనకు సీటు ఇస్తానన్నా ముద్రగడ పోటీచేయడానికి నిరాకరించారు.

అయితే అంతకంటే ముందే.. ముద్రగడకు కాకినాడ ఎంపీ సీటును జగన్ ఆఫర్ చేశారు. కాకినాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనుకున్న చలమలశెట్టి సునీల్ చివరి నిమిషంలో వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ గట్టి అభ్యర్థి కోసం వెతికి ముద్రగడను సంప్రదించింది. కానీ ముద్రగడ వైసీపీకి నో చెప్పారు. జనసేన వెంట నడిచారు.

దీంతో చేసేందేం లేక వంగా గీతను వైసీపీ ఎంపిక చేసింది. ఆమె ఎంపీగా గెలిచింది.

ఇలా అందివచ్చిన అదృష్టాన్ని కాలదన్ని ఎంపీ అయ్యే అవకాశాన్ని ముద్రగడ కోల్పోయారు. ఆయన కాకున్నా ఆయన వారసులను రంగంలోకి దించినా గెలిచేవారు. కానీ వైసీపీ గాలిని అంచనవేయకుండా ఈ రాజకీయ కురువృద్ధుడు పెద్ద పొరపాటే చేశాడు.

Tags:    
Advertisement

Similar News