కోడెల కుమారుడు అరెస్టు కు రంగం సిద్ధం..?

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్‌, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణ అరెస్టుకు రంగం సిద్ధ‌మైంద‌ని అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు..! కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. గ‌త 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత స్పీక‌ర్‌గా ఎన్నిక‌య్యారు. అయితే, అప్ప‌టి నుంచి ఆయ‌న కుమారుడు ప‌రోక్షంగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. ముఖ్యంగా జీఎస్టీ.. స్థానంలో కేఎస్టీ (కోడెల ట్యాక్స్).. వ‌సూలు చేస్తున్నార‌ని ఆ నియోజకవర్గ ప్రజలు అనేవాళ్ళు. […]

Advertisement
Update:2019-06-03 10:13 IST

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్‌, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణ అరెస్టుకు రంగం సిద్ధ‌మైంద‌ని అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు..!

కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. గ‌త 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత స్పీక‌ర్‌గా ఎన్నిక‌య్యారు. అయితే, అప్ప‌టి నుంచి ఆయ‌న కుమారుడు ప‌రోక్షంగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. ముఖ్యంగా జీఎస్టీ.. స్థానంలో కేఎస్టీ (కోడెల ట్యాక్స్).. వ‌సూలు చేస్తున్నార‌ని ఆ నియోజకవర్గ ప్రజలు అనేవాళ్ళు. విప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ కూడా పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో ఇదే విష‌యాన్ని ఏక‌రువు పెట్టారు.

కోడెల, ఆయన కొడుకు, ఆయన కూతురు ఎవరికివారే గుంటూరు జిల్లాను అందినకాడికి దోచుకున్నారు. వాళ్ళ మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందులో ఒకేఒక్క వ్యవహారం మీద ఇప్పుడు విచారణ జరుగుతోంది.

ఇక‌, గుంటూరు జిల్లాలో కేబుల్ వ్యాపారం నిర్వ‌హించిన శివ‌రామ‌కృష్ణ‌.. ప‌లువురు వ్యాపారుల‌ను మోసం చేసి మ‌రీ రూ.70 కోట్ల‌కు పైగా వెనుకేసుకున్నార‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు కంపెనీలు ఆయ‌న‌పై ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు గత రాత్రి నుంచి కోడెల శివరాం కి సంబందించి హైదరాబాద్, గుంటూరుల లోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లి పోలీసులతో పాటు ఈడి అధికారులు కూడా ఉన్నార‌ని స‌మాచారం. అయితే, ఇదంతా కూడా కేబుల్ పైరసీ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం జ‌రుగుతున్న సోదాలేన‌ని.. ఇందులో ఎక్క‌డా రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు లేవ‌ని అంటున్నారు శివ‌రాంపై కేసులు పెట్టిన కంపెనీలు.

పైరసీ ద్వారా కేబుల్ కనెక్షన్ వ్యాపారం చేసి సుమారు 70 కోట్ల రూపాయలు కేబుల్ కంపెనీలకు ఏగ్గొట్టినట్లు కోర్టు కి ఆదారాలు సమర్పించాయి. ఈ కేసు విచార‌ణ‌ను చేప‌ట్టిన కోర్టు.. భారత దేశ చరిత్ర లో ఇంత భారీ స్దాయి లో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్ పైరసీ కేసు ఇదే అని కోర్టు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో కోర్టు ఆదేశాల మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు ఎన్నికలకు ముందు ఒకసారి శివరామకృష్ణ ఆఫీలపై దాడి చేశారు. ఆధారాలను సేకరించారు. శివరామకృష్ణను అరెస్టు చేస్తారని వార్తలొచ్చాయి. అయినా అప్పుడు ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఆఫీసుల్లో అణువ‌ణువును గాలిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఢిల్లీ పోలీసులు కోడెల శివ‌రామ‌కృష్ణను ఏక్ష‌ణానైనా అరెస్టు చేసేందుకు వీలుందని సమాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన విచ్చ‌ల‌విడి దోపిడీకి ఇప్పుడైనా అడ్డుక‌ట్ట ప‌డుతోంద‌ని వ్యాపారులు ఆనందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News