మహేష్ ఫొటోలను మార్ఫ్ చేసి.... ట్రోల్ చేస్తున్నారు....

‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్నాడు. తన కెరీర్లో 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అంతే జోరు కనబరిచింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పైన దృష్టి సారించిన సంగతి […]

Advertisement
Update:2019-06-02 08:13 IST

‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్నాడు. తన కెరీర్లో 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అంతే జోరు కనబరిచింది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పైన దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ సారి మహేష్ బాబు ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

అయితే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి అభిమానులు మహేష్ బాబు ఫొటోను మార్ఫ్ చేసి పోస్టర్లు తయారుచేసి అవే అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు అన్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ చిత్రబృందం ఇంకా మహేష్ బాబు లుక్ విడుదల చేయలేదు. ఈ సినిమా కి సంబంధించిన అధికారిక పోస్టర్ ఇంకా బయటకు రాలేదు.

ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ మొదలు పెట్టే ప్లాన్స్ లో బిజీగా ఉంది. అనిల్ సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Tags:    
Advertisement

Similar News