ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్లో డబుల్ షాక్

సెరెనా, నవోమీ ఒసాకా టైటిల్ ఆశలు ఆవిరి ఒసాకాకు సిన్యకోవా, సెరెనాకు సోఫియా దెబ్బ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ మూడోరౌండ్లోనే అతిపెద్ద సంచలనాలు నమోదయ్యాయి. టాప్ సీడ్ నవోమీ ఒసాకా, 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ సెరెనా విలియమ్స్ ప్రీ-క్వార్టర్స్ చేరకుండానే ఇంటిదారి పట్టారు. పాపం! సెరెనా… మహిళల సింగిల్స్ టైటిల్ వేట కోసం 10వ సీడ్ హోదాలో బరిలోకి దిగిన మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ కు మూడోరౌండ్లోనే అనుకోని ఓటమి ఎదురయ్యింది. తన కెరియర్ […]

Advertisement
Update:2019-06-02 02:16 IST
  • సెరెనా, నవోమీ ఒసాకా టైటిల్ ఆశలు ఆవిరి
  • ఒసాకాకు సిన్యకోవా, సెరెనాకు సోఫియా దెబ్బ

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ మూడోరౌండ్లోనే అతిపెద్ద సంచలనాలు నమోదయ్యాయి. టాప్ సీడ్ నవోమీ ఒసాకా, 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ సెరెనా విలియమ్స్ ప్రీ-క్వార్టర్స్ చేరకుండానే ఇంటిదారి పట్టారు.

పాపం! సెరెనా…

మహిళల సింగిల్స్ టైటిల్ వేట కోసం 10వ సీడ్ హోదాలో బరిలోకి దిగిన మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ కు మూడోరౌండ్లోనే అనుకోని ఓటమి ఎదురయ్యింది.

తన కెరియర్ లో రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న సెరెనా ఆశలు…మూడోరౌండ్లోనే ఆవిరైపోయాయి.
తన దేశానికే చెందిన యువ క్రీడాకారిణి, 20 ఏళ్ల సోఫియా కెనిన్ 6-2, 7-5 తో 37 ఏళ్ల వెటరన్ సెరెనాపై సంచలన విజయం సాధించింది.

మూడుసార్లు ఫ్రెంచ్ చాంపియన్ సెరెనా 2014 ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్లో ఓటమి తర్వాత…మరోసారి మూడోరౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇదే మొదటిసారి. 2002, 2013, 2015 సీజన్లలో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన సెరెనాకు 2019లో మాత్రం చేదుఅనుభవం తప్పలేదు.

సెరెనా పై సంచలన విజయం సాధించిన సోఫియా నాలుగోరౌండ్లో…ఆస్ట్రేలియా ప్లేయర్ బార్టీతో అమీతుమీ తేల్చుకోనుంది.
టాప్ సీడ్ ఒసాకా కు తప్పని షాక్… ప్రస్తుత సీజన్లో వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాలన్న ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ నవోమీ ఒసాకా సైతం మూడోరౌండ్లోనే నిష్క్రమించక తప్పలేదు.

మూడోరౌండ్లో చెక్ రిపబ్లిక్ కు చెందిన 42వ ర్యాంక్ ప్లేయర్ కాథరీనా సినియకోవా వరుససెట్లలో ఒసాకాను కంగుతినిపించింది. రెండోరౌండ్ విజయం కోసం విక్టోరియా అజరెంకాతో మహాపోరాటం చేసి తీవ్రంగా అలసిపోయిన ఒసాకా మూడోరౌండ్లో చురుగ్గా కదలలేకపోయింది. చివరకు 4-6, 2-6తో ఓటమి ఎదుర్కొనాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News