పది సెకన్ల య్యూజిక్.... పదిహేను లక్షలు
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అతి పెద్ద బడ్జెట్ సినిమాలు ఏంటి అంటే వెంటనే సై రా నరసింహా రెడ్డి, సాహో పేర్లు చెబుతారు. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాలు రెండూ ఈ ఏడాదే విడుదల అవ్వనున్నాయి. ఆగస్టు 15 న సాహో విడుదల అవుతుందని స్వయంగా ప్రభాసే ప్రకటించినా… ఈ సినిమా ఘూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైనా… మేకర్స్ మాత్రం ఈ సినిమా ని పూర్తి చేయడం లో […]
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అతి పెద్ద బడ్జెట్ సినిమాలు ఏంటి అంటే వెంటనే సై రా నరసింహా రెడ్డి, సాహో పేర్లు చెబుతారు. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాలు రెండూ ఈ ఏడాదే విడుదల అవ్వనున్నాయి.
ఆగస్టు 15 న సాహో విడుదల అవుతుందని స్వయంగా ప్రభాసే ప్రకటించినా… ఈ సినిమా ఘూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైనా… మేకర్స్ మాత్రం ఈ సినిమా ని పూర్తి చేయడం లో విఫలమయ్యారు. తెలుగు, తమిళం, హిందీ లో ఒకేసారి ఈ సినిమాని చేయాల్సి రావడం తోనే ఆలస్యం అవుతుందన్నది మరో వాదన.
ఇక పోతే సినిమా బడ్జెట్ విషయానికి వస్తే, మొదలు పెట్టినప్పుడు ఒక బడ్జెట్ తో సినిమా ని మొదలు పెట్టగా, అది కాస్త తడిసి మోపెడయింది. ఈ మధ్య నే ఈ సినిమా కి సంగీత దర్శకులు గా ఉన్న శంకర్ -ఎహసాన్- లాయ్ వైదొలిగారు. ఇంకా కొత్త సంగీత దర్శకుడిని లాక్ చేయలేదు మేకర్స్.
తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక పది సెకన్ల మ్యూజిక్ బిట్ ని కొనుగోలు చేశారట టీమ్ సాహో. దాని కోసం దాదాపు గా పదిహేను లక్షలు వెచ్చించారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అనవసరం గా డబ్బు ఖర్చు చేస్తున్నారని, దాని బదులు సంగీత దర్శకుడిని పెట్టుకొని అతడికి డబ్బు ఇస్తే సరిపోతుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తూంటే ముందే చెప్పినట్లుగా ఆగస్టు 15 న అసలు సాహో విడుదల అవుతుందా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.