ఇరు రాష్ట్రాల సమస్యలపై ఒప్పందానికి వస్తున్న కేసీఆర్‌, జగన్‌

ఏపీ తెలంగాణ విడిపోయాక కేసీఆర్, చంద్రబాబు పాము ముంగిసల వలే కొట్లాడుకున్నారు. ఆధిపత్యం కోసం విభజన సమస్యలను క్లిష్టం చేసి ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పెట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు హైదరాబాద్‌ ను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10ఏళ్లు ఉండాలని చట్టంలో ఉన్నా ఇప్పుడు హైదరాబాద్ ను ఆంధ్రా ప్రభుత్వం వాడుకోవడం లేదు. కానీ అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించి […]

Advertisement
Update:2019-05-31 03:10 IST

ఏపీ తెలంగాణ విడిపోయాక కేసీఆర్, చంద్రబాబు పాము ముంగిసల వలే కొట్లాడుకున్నారు. ఆధిపత్యం కోసం విభజన సమస్యలను క్లిష్టం చేసి ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పెట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు హైదరాబాద్‌ ను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10ఏళ్లు ఉండాలని చట్టంలో ఉన్నా ఇప్పుడు హైదరాబాద్ ను ఆంధ్రా ప్రభుత్వం వాడుకోవడం లేదు.

కానీ అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించి ఏపీకి తెలంగాణకు మేలు చేయాలని జగన్‌ డిసైడ్ అయినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో మీటింగ్ సందర్భంగా జగన్ ఈ ప్రస్తావన తేగా కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

ముఖ్యంగా జగన్ అంతర్రాష్ట్ర జలవివాదాలు, నీటి కేటాయింపులు, ఉద్యోగుల విభజన కేటాయింపులు, పెండింగ్ లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి ఏకంగా కొంతమంది ఏపీ అధికారులను హైదరాబాద్ లో ఉంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఇప్పటికీ తెగని విద్యుత్ వినియోగం.. ఉన్నత విద్య, అబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడానికి జగన్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉమ్మడి సంస్థలపై తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరుపుతారు.

ఈ మేరకు కేసీఆర్ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పి బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ను జగన్ కు కేటాయించాలని కేసీఆర్ తెలంగాణ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు జగన్, కేసీఆర్ ఇలా ముందుకు రావడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News