అత్యంత ప్రమాదకరమైన బల్లుల స్వాధీనం

నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్‌ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు

Advertisement
Update:2024-11-27 16:03 IST

అక్రమంగా తరలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్‌ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా వీటిని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. డీఆర్‌ఐ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. ఈ నెల 23న బ్యాంకాక్‌ థాయ్‌లాండ్‌ నుంచి విశాఖకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులు కేక్‌ ప్యాకెట్లలో వీటిని దాచి ఉంచి తీసుకొస్తుండగా గుర్తించినట్లు డెరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలీజెన్స్‌ అధికారులు గుర్తించారు.స్వాధీనం చేసుకున్న బల్లులను డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.వన్యప్రాణి సంరక్షణ చట్టం సహా, అన్యదేశాల అటవీ జంతువుల అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.




Tags:    
Advertisement

Similar News