ఆగష్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం క్రైస్తవ, ముస్లిం, హిందూ మత పెద్దలు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే నేత స్టాలిన్‌, కొందరు తెలంగాణ మంత్రులు హజరయ్యారు. స్టాలిన్‌ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు చెప్పి…. జగన్‌ ను అభినందించారు. ఆ […]

Advertisement
Update:2019-05-30 08:19 IST

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం క్రైస్తవ, ముస్లిం, హిందూ మత పెద్దలు ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే నేత స్టాలిన్‌, కొందరు తెలంగాణ మంత్రులు హజరయ్యారు. స్టాలిన్‌ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు చెప్పి…. జగన్‌ ను అభినందించారు. ఆ తరువాత కేసీఆర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు ఆత్మీయంగా, ఐక్యంగా, పరస్పరం సహకరించుకుంటూ ఉంటే అద్భుతాలు సాధించవచ్చని, ముఖ్యంగా గోదావరి జలాలను, కృష్ణా జలాలను జాగ్రత్తగా వాడుకుంటే రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు.

అనంతరం జగన్‌ మాట్లాడుతూ…. మా మేనిఫెస్టోను తూచా తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ నెల నుంచి వృద్ధాప్య పింఛన్‌ ను 2,250 రూపాయలకు పెంచుతామని, వచ్చే ఏడాది నుంచి 2,500 రూపాయలు, ఆ తరువాత ఏడాది నుంచి 2,750 రూపాయలు, ఆ తరువాత నుంచి 3,000 రూపాయలు అందిస్తామని చెబుతూ ఆ ఫైల్‌ పై ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేశారు. ఈ పథకానికి వైఎస్ఆర్ పెన్షన్ అని నామకరణం చేశారు.

ఏ ప్రభుత్వ పథకాన్నీ ప్రజలకు అందించేటప్పుడు వాళ్ళ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం…. లబ్దిదారులు ఆ పథకానికి అర్హులైతే చాలు…. వాళ్ళకు అందజేస్తామన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తామని…. అవినీతి లేని వివక్ష లేని పాలనను అందిస్తామని, పై స్థాయినుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తామని….. టెంటర్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా అమలు చేస్తామని అన్నారు.

ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని, వ్యక్తులకు కావాల్సిన రేషన్‌ కార్డు గానీ, ఏ ప్రభుత్వ సర్టిఫికేట్‌ గానీ ఈ గ్రామ సచివాలయాలనుంచే పొందవచ్చునని… లంచాలకు తావులేకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇక నుంచి ప్రభుత్వ సేవలన్నీ మీ గడప వద్దనే అందజేస్తామని చెప్పారు.

ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్‌ను నియమించి ఆ వాలంటీర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని, ఇలాంటి వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందిని నియమిస్తామని, వాళ్ళకు నెలకు 5 వేల చొప్పున జీతం ఇస్తామని అన్నారు. ఈ నియామకాలన్నీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రభుత్వ వ్యవస్థలన్నీ పై నుంచి కింది దాకా ప్రక్షాళన చేసి అవినీతి లేని పాలనను అందిస్తామని, ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్న అనేక కాంట్రాక్టులను వెంటనే రద్దు చేస్తామని అన్నారు. అవినీతిలేని కాంట్రాక్టు పనులకోసం రివర్స్‌ టెండరింగ్‌ పాలసీని తీసుకువస్తామని చెప్పారు.

నాకు ఈ ముఖ్యమంత్రి పదవిని అందించిన ప్రజలకు, దేవుడికి, పైనున్న మా నాన్న గారికి, మా అమ్మకు కృతజ్ఞతలూ అంటూ ఉపన్యాసం ముగించారు.

Tags:    
Advertisement

Similar News